PM Modi: ప్రధాని మోదీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించిన నరేంద్ర మోడీ పట్ల భారతీయుల్లో వైఖరి ఏమాత్రం మారలేదని, క్రమంగా ఆయనపై నమ్మకం మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ.. భారతదేశానికి రెండు సార్లు ప్రధాని. మరోసారి కూడా ఆయనే ప్రధాని పగ్గాలు చేపట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న లీడర్. గతంలో ఏ భారత ప్రధానికి కూడా విదేశాల్లో లేని ఆదరణ కైవసం చేసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. ఇటు అన్ లైన్ లోనూ.. అటు ఆఫ్ లైన్ లోనూ ఎనాలేని క్రేజ్ ఉన్న లీడర్ ఆయన.. ఏ సర్వే అయినా.. ఏ గణాంకాలైనా మోదీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మరో సర్వే కూడా ఇవే విషయాలను వెల్లడించాయి. 

అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ (PEW) సెంటర్ సర్వే ప్రకారం.. భారతదేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీకే జై కొడుతున్నారనీ, అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని తెలిపింది.అదే సమయంలో పది మందిలో ఏడుగురు భారతీయులు తన వల్ల ప్రభావవంతం అవుతున్నారని వివరించింది. G20 సమ్మిట్‌కు ముందు నిర్వహించిన ఈ అధ్యయనంలో.. 46 శాతం మంది భారతీయులు మోడీపై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనీ, మరో 34 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారనీ, అదే సమయంలో 16 శాతం మంది ప్రజలు ఎలాంటి నిర్ణయం తెలియజేయకుండా.. తటస్థంగా ఉన్నారని సర్వే పేర్కొంది. జీ 20 దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఈ సర్వే వివరాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయనే చెప్పాలి. 

ఈ సర్వేలో భాగంగా ప్యూ రీసెర్చ్ (PEW) సెంటర్.. భారత్‌పై ప్రపంచ దేశాల అభిప్రాయాలను స్వీకరించింది. అయితే ఈ సర్వేలో అత్యధికంగా 71 శాతం మంది ఇజ్రాయిల్ ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. 2022 ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు 24 దేశాల్లో 30, 861 మంది అభిప్రాయాలను సేకరించినట్టు వెల్లడించింది. ఇందులో 2,611 మంది భారతీయులు ఉన్నట్లు చెప్పింది.

మంగళవారం విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం.. 10 మంది భారతీయులలో 8 మంది ప్రధాని మోదీకి అనుకూలంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారని సర్వే తెలిపింది. ఇందులో మెజారిటీ (55 శాతం) మంది ఎక్కువ అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. ప్యూ సర్వే ప్రకారం.. 2023లో కేవలం 5% మంది భారతీయులు మాత్రమే ప్రధాని మోదీపై ప్రతికూల అంచనాలను కలిగి ఉన్నారు. 

ప్యూ సర్వే ఫలితాలపై బీజేపీ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ అలాగే ఉందని, ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని పేర్కొంది. "ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాదరణ చెక్కుచెదరలేదు! భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రజలు భారతదేశం యొక్క ప్రపంచ ప్రభావం మరింత బలపడుతుందని నమ్ముతున్నారు!" బీజేపీ అధికారిక హ్యాండిల్ గతంలో ట్విటర్‌లో X ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. అదే సమయంలో పదిమందిలో ఏడుగురు భారతీయులు ..భారతదేశ శక్తి పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారని ప్యూ సంస్థ వెల్లడించింది.