కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో దాదాపు 80 రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి.

చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు పెరగలేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రూడాయిల్ కూడా బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ క్రమంలోనే చమురు కంపెనీలు సైతం... చమురు ధరలపై లీటర్‌కు 60 పైసల చొప్పున పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్ధిరంగా ఉంది. అటు విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.74.21 వద్ద, డీజిల్ ధర రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది. 

Also Read:

కోరలు చాస్తున్న కరోనా: స్పెయిన్ ను తోసిరాజేసి వైరస్ పీడిత 5వ దేశంగా భారత్

సెప్టెంబర్‌లో ఇండియాలో కరోనా పూర్తిగా తగ్గే ఛాన్స్: నిపుణులు