Asianet News TeluguAsianet News Telugu

రైతులపై కేసులు, వెనక్కి తగ్గిన పెప్సీ: కేసులు విత్‌డ్రా

గుజరాత్‌లో ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళదుంపల సాగును చేస్తున్న రైతులపై పెప్సికో కేసులు పెట్టడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో పెప్సి సంస్థ దిగివచ్చింది. 

pepsi co india withdraws case against gujarat potato farmers
Author
Gujarat, First Published May 3, 2019, 1:10 PM IST

గుజరాత్‌లో ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళదుంపల సాగును చేస్తున్న రైతులపై పెప్సికో కేసులు పెట్టడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో పెప్సి సంస్థ దిగివచ్చింది.

ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళాదుంపల సాగును నిలిపివేస్తేనే గుజరాత్‌కు చెందిన రైతులపై పెట్టిన కేసులను తాము ఎత్తివేస్తామని స్పష్టం చేయడంతో రైతులు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు.

దేశవ్యాప్తంగా పెప్సీకి వ్యతిరేకంగా రైతులు పోరాటానికి దిగడంతో ఆ సంస్థ గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. కాగా పెప్సికో గ్రూప్‌కు చెందిన లేస్, చిప్స్ కోసం ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళదుంపలపై పేటెంట్ తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ రకానికి చెందిన బంగాళదుంపలను గుజరాత్‌కు చెందిన రైతులు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సీ కేసు పెట్టింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios