Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, మోడీ సర్కార్ అనుసరిస్తూ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇటీవల కేంద్రం అధిక ద్రవ్యోల్బణం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ రేట్లు తగ్గించడంపై రాహుల్ గాంధీ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల యొక్క పరిణామాలను సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
"సాధారణ పౌరులు ప్రభుత్వ తప్పుడు విధానాల పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు: FD రేటు 5.1 శాతం (తగ్గింది), PPF 7.1 శాతం (తగ్గింది), EPF 8.1 శాతం (తగ్గింది). రిటైల్ ద్రవ్యోల్బణం: 6.07 శాతం (పెరిగింది) టోకు ద్రవ్యోల్బణం: 13.11 శాతం (పెరిగింది) వీటన్నింటి నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా? కాదా?" అని గాంధీ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల రేటు తగ్గింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది.
మరోవైపు.. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గాంధీలు తమ స్థానం నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని, అందుకు ఇదే సరైన సమయం అని అన్నారు. ఇతరులకు( గాంధేతరులకు) కూడా అవకాశం కల్పించాలని సూచించారు. గాంధేయులు స్వచ్ఛందంగానే ఈ పని చేయాలని, ఎందుకంటే.. ప్రస్తుత పొజిషన్‌లకు నామినేట్ చేసిన కమిటీ.. ఎలా వారిని తొలగిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం రాహుల్ గాంధే.. అన్ని తానై వ్యవహరిస్తున్నారనీ, ఒక రకంగా చెప్పాలంటే.. రాహులే పార్టీ అధ్యక్షుడు అని కపిల్ సిబల్ అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ అని ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన ఏ అధికారంతో ఆ నిర్ణయం ప్రకటించారని అడిగారు. ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదని, కానీ, పార్టీ నిర్ణయాలు అన్నీ ఆయనే తీసుకుంటారని వివరించారు. అలాంటి సమయంలో వారు ఎందుకు మళ్లీ రాహుల్ గాంధే అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని అడుగుతున్నారు? అంటూ ప్రశ్నించారు.
