Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌జ‌లు క‌రోనా ఏజెంట్లు గా మారొద్దు.. మ‌హారాష్ట్ర వాసుల‌కు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే హెచ్చ‌రిక‌

ప్రజలు కరోనా ఏజెంట్లుగా మారి వ్యాధిని వ్యాప్తి చేయొద్దని మహారాష్ట్ర సీఎం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటించి వ్యాప్తిని అరికట్టడానికి అందరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 

People should not become Corona agents .. CM Uddhav Thackeray warns Maharashtra residents
Author
Hyderabad, First Published Jan 10, 2022, 4:00 PM IST

కోవిడ్ -19 (covid -19) వ్యాప్తి ఎక్కువగా ఉంద‌ని, ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ (corona virus) కు ఏజెంట్లుగా మారొద్ద‌ని మ‌హారాష్ట్ర వాసుల‌ను  సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే (cm uddhav thackeray) హెచ్చ‌రించ్చారు. పెరుగుతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిని ‘క‌రోనా ఏజెంట్లు’ (corona agents)  అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇప్పుడు కొనసాగుతున్న వేవ్ లో క‌రోనా వ్యాప్తి రేటు చాలా ఎక్కువ‌గా ఉంద‌ని సీఎం అన్నారు. ఈ వైర‌స్ ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా క‌దా అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెట్టి అందరూ జాగ్ర‌త్త‌గా వ‌హ‌రించాల‌ని కోరారు. లేక‌పోతే అది మ‌హారాష్ట్ర ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. 

ప్రతీ ఒక్కరూ నిబందనలు పాటించాలి
క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలోనే కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ (covid -19 taskforce), కేంద్ర ప్ర‌భుత్వంతో చర్చించామ‌ని, అలాగే వైద్య రంగంలోని నిపుణ‌ల‌ను స్వీక‌రించిన త‌రువాత రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలు విధించిందని సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే తెలిపారు. తాము లాక్ డౌన్ విధించి అన్ని కార్యక‌లాపాల‌ను నిలిపివేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని అన్నారు. త‌మ వ‌ద్ద చ‌ట్టాలు, ప‌రిమితులు మాత్రమే ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల‌న‌ను ఎదుర్కోలేవ‌ని అన్నారు. స‌మాజంలోని ప్ర‌తీ పౌరుడు త‌మ హోదాతో సంబంధం లేకుండా ఈ క‌రోనాను ఎదుర్కొవ‌డానికి ఆరోగ్య శాఖ సూచించిన నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. 

లాక్ డౌన్ కు బ‌దులు ఆంక్ష‌లు బెట‌ర్..
లాక్ డౌన్ (lock down) విధించి ఎంతో మంది జీవ‌నోపాధిని దెబ్బ‌తీసే బ‌దులు.. ’ బ్రేక్ ద చైన్’ (break the chaine) తో పాటు ‘మిషన్ బిగిన్ ఎగైన్’ (mission bagin agian) వంటి ఆంక్షలును మళ్లీ అమలు చేసి ఈ మహమ్మారి నుంచి బయటపడటం మంచిదని  సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా నిబంధనలను శ్రద్ధగా పాటించే మెజారిటీ వ్యక్తులను ప్రశంసిస్తూనే.. వాటిని ఉల్లంఘించే కొంతమందిని ఆయన విమర్శించారు. ఇలాంటివి ఇక‌పై చెల్ల‌వ‌ని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు. కరోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని అదేశాలు ఇచ్చామ‌ని తెలిపారు. ఇది ప్ర‌తీ ఒక్క‌రి మేలుకోస‌మే అని, కాబ‌ట్టి అంద‌రూ దీనిని  పాటించి ఈ మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌దామ‌ని అన్నారు. 

ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై ఒత్తిడి ప‌డుతోంది..
రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిలో ఉంద‌ని సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే అన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ (covid -19 vaccine) తీసుకోని వారికి క‌రోనా సోకితే, అలాగే అధిక తీవ్ర‌త‌తో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వారి సంఖ్య పెరిగితే హస్పిట‌ల్‌ (hospitals) లో చేరిక‌లు పెరుగుతాయ‌ని అన్నారు. దీంతో ఆక్సిజ‌న్ (oxizen) డిమాండ్ కూడా పెరుగుతుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే  అనేక చోట్ల డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్ వైద్య కార్మికులకు  క‌రోనా సోకుతోంద‌ని అన్నారు. ఇది అంద‌రికీ ఒక హెచ్చ‌రిక లాంటిద‌ని తెలిపారు. గ‌త రెండేళ్ల నుంచి రాష్ట్రంలో వైద్య స‌దుపాయాలు పెంచామ‌ని చెప్పారు. అయితే వైద్య సేవలు అందించే వారే అనారోగ్యానికి గురైన‌ప్పుడు, సదుపాయాలు పెరిగి ఏం లాభ‌మ‌ని అన్నారు.

విద్యార్థులు స‌మ‌యం వృథా చేసుకోవ‌ద్దు..
క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ కాలేజీలు (colleages), స్కూల్స్ (schools)మూసివేసి, చ‌దువుల‌న్నీ ఆన్ లైన్ మోడ్ (online mode)కు మారాయ‌ని సీఎం అన్నారు. అయితే విద్యార్థులు ఇది సెలవుల స‌మ‌యం అని భావించి, అన‌వ‌రంగా తిరుగుతూ స‌మ‌యం వృథా చేసుకోవ‌ద్ద‌ని అన్నారు. శ్ర‌ద్ధ‌గా ఆన్ లైన్ క్లాసుల్లో పాఠాలు వింటూ చ‌దువుకోవాల‌ని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios