న్యూఢిల్లీ: తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే ఆ ఉల్లి కాస్త రూట్ మార్చింది. కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగు తినేలా చేస్తోంది. తమిళనాడు మధురైలో కిలో రూ. 200లకు చేరుకుని ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.

'5 కిలోలు కొనడానికి వచ్చే వినియోగదారులు.. కేవలం ఒక్క కేజీతోనే సరిపెట్టుకుని వెనుదిరుగుతున్నారు.' అంటున్నారు ఉల్లి వ్యాపారులు. ఇక వారానికి కేవలం ఉల్లి కొనుగోలు కోసం రూ.350 నుంచి 400 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు వినియోగదారులు.

ప్లగింగ్ ద్వారా 2.7 టన్నుల ప్లాస్టిక్ సేకరించిన "రన్ టు మేక్ కంట్రీ ఫ్రీ"

పంట దిగుబడి తగ్గిపోయి సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది ఉల్లి. గత కొద్ది రోజులుగా దేశంలో ఎటు చూసినా ఉల్లి లొల్లి వినిపిస్తూనే ఉంది. కొండెక్కిన ఉల్లి ధరలు దిగిరానంటున్నాయి. కేంద్రం దిగుమతులు పెంచి, ధర తగ్గించే చర్యలు చేపట్టింది. అయినా కిలో ఉల్లి ధర రూ.165కు చేరింది. గోవాలో రూ.165, అండమాన్‌ నికోబార్ దీవుల్లో రూ.160, కేరళలో గరిష్ఠంగా రూ.150లకు ఉల్లి ధర చేరింది. కొన్ని నగరాల్లో ఉల్లిగడ్డ ధర రూ.140 వరకు చేరిందని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. 

ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో కిలో ఉల్లి రూ.120, ఢిల్లీలో రూ.100కు అమ్ముతున్నట్టు తెలిపింది.ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం... 21 వేల టన్నుల దిగుమతులను ఎమ్​ఎమ్​టీసీ ద్వారా చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. 

వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్

ఈ నిల్వలు జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.అకాల వర్షాలకుతోడు పంట ఉత్పత్తి తగ్గటమే ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి వస్తే ఉల్లి ధరలు తగ్గే అవకాశముందని వ్యాపారులు, ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.