Asianet News TeluguAsianet News Telugu

వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్

మానేటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) లోని ఆరుగురు సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసినట్లు సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 5 న ఒక ప్రకటనలో తెలిపింది. 

rbi governor says good news to bank customers
Author
Hyderabad, First Published Dec 5, 2019, 12:42 PM IST

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తన డిసెంబర్ విధాన సమీక్షలో రెపో రేటును మార్చలేదు,మానేటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) లోని ఆరుగురు సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసినట్లు సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 5 న ఒక ప్రకటనలో తెలిపింది. 

also read కార్వీపై బ్యాంకుల ఊరటకు ‘శాట్’నో...సెబీ వద్దకే వెళ్లండి

మానిటరీ పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు ఆర్‌బి‌ఐ ప్రకటించింది. వరుసగా ఆరోసారి కూడా ఆర్‌బీఐ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేట్లను ఎప్పటిలాగే ఉంచుతు రెపో 5.15 శాతం, రివర్స్‌ రెపో 4.90 శాతం వద్ద కొనసాగనున్నాయి. 

 

కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా దీనికి అంగీకరించారు. దీంతో పాటు వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనాలను సైతం తగ్గించింది. 2020-21 ప్రథమార్ధంలో వృద్ధి 5.9- 6.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. అక్టోబర్‌- మార్చి ద్రవ్యోల్బణ అంచనాలను 5.1 శాతానికి పెంచింది.  అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం అంచనాల కన్నా ఎక్కువగా ఉందని తెలిపింది. 

also read మీ చుట్టు రోజూ తిరుగలేం...జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

ఎంపిసి నిర్ణయంపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేలికగా వ్యాఖ్యానించారు. వృద్ధిని పునరుద్ధరించడానికి అవసరమైనంత కాలం ఈ వైఖరి కొనసాగుతుందని అలాగే అక్టోబర్‌లో సేవా రంగ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు.చమురు సంస్థల ఎగుమతి వృద్ధి సానుకూలంగా మారిందని తెలిపారు. అనేక ప్రభుత్వ చర్యలు, ఆర్‌బిఐ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు మరింత బలోపేతం చేస్తాయని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios