గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్‌ కంకారియా అడ్వెంచర్ పార్క్‌లో జాయ్ రైడ్ కుప్పకూలిన ఘటనలో  ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహిస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని  అహ్మాదాబాద్ కంకారియా పార్క్‌లో  జాయింట్ వీల్‌పై 30 మంది ఉన్నారు. అయితే జాయింట్ వీల్ ప్రధాన పైప్ విరిగిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.  జాయింట్ రైడ్ చేస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

జాయింట్ రైడ్ తిరుగుతున్న సమయంలో  ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. జాయింట్ వీట్ ప్రధాన పైప్ ళా కూలిపోయిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్పారు.