Asianet News TeluguAsianet News Telugu

కొలీజియం వ్యవస్థ వల్ల దేశ ప్రజలు సంతోషంగా లేరు - కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజుజు మరో సారి కొలీజియం వ్యవస్థపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ వల్ల ప్రజలు కూడా సంతోషంగా లేరని చెప్పారు. 

People of the country are not happy with the collegium system - Union Law Minister Kiren Rijiju
Author
First Published Oct 18, 2022, 12:25 PM IST

కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజలు సంతోషంగా లేరని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయమూర్తులను నియమించడమే ప్రభుత్వ పని అని కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రచురితం అయ్యే ‘పాంచజన్య’అనే వారపత్రిక నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’కార్యక్రమంలో సోమవారం కిరణ్ రిజిజు మాట్లాడారు. సగం మంది న్యాయమూర్తులు నియామకాల్లోనే నిమగ్నమై ఉన్నారని, దీనివల్ల వారి న్యాయం అందించే ప్రాథమిక విధికి ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. 

ఏడునెలల పసికందుపై వీధి కుక్కల దాడి, పేగులు బయటికి లాగి.. అమానుషం...

అంతకు ముందు కూడా కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజిజు ప్రశ్నలు సంధించారు. గత నెల ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక సదస్సులో ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాల కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై అడిగిన ప్రశ్నకు రిజిజు స్పందిస్తూ.. 1993 వరకు భారతదేశంలోని ప్రతీ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి న్యాయ మంత్రిత్వ శాఖ నియమించిందని తెలిపారు. ఆ సమయంలో మనకు చాలా మంది ప్రముఖ న్యాయమూర్తులు ఉన్నారని చెప్పారు. 

రాజ్యాంగంలో దీనిపై పూర్తి స్పష్టత ఉందని కిరెన్ రిజుజు తెలిపారు. భారత రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారని, అంటే న్యాయ మంత్రిత్వ శాఖ భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి న్యాయమూర్తులను నియమిస్తుందని పేర్కొన్నారు. మీడియాను పర్యవేక్షించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నట్లే న్యాయవ్యవస్థను పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని, ఇందులో న్యాయవ్యవస్థ కూడా చొరవ తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య సంబంధాలపై టార్గెట్.. పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌లను పర్యవేక్షించే వ్యవస్థ ఉందని, అయితే న్యాయవ్యవస్థలో అలాంటి యంత్రాంగం లేదని ఆయన తెలిపారు. కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థలు తమ తమ సర్కిల్‌ల్లోనే ఉంటూ తమ పనిపై దృష్టి సారిస్తే ఈ సమస్య తలెత్తదని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ మా కార్యనిర్వాహక, శాసనసభ పూర్తిగా వాటి పరిధిలో కట్టుబడి ఉన్నాయని నేను భావిస్తున్నాను. అవి తప్పు చేస్తే న్యాయవ్యవస్థ సరిదిద్దుతుంది. న్యాయవ్యవస్థ దారి తప్పినప్పుడు దాన్ని సరిదిద్దే వ్యవస్థ లేకపోవడమే సమస్య. ’’ అని ఆయన తెలిపారు.

తాను న్యాయవ్యవస్థకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేనని, అయితే ఇది ప్రజాస్వామ్యంలో భాగమని, లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా యుగంలో ఇది ప్రజల దృష్టిలో కూడా ఉన్నందున తాను దానిని ఖచ్చితంగా ‘అలెర్ట్’ చేయగలనని కేంద్ర మంత్రి తెలిపారు. ‘కాబట్టి మీ ప్రవర్తన కూడా అనుకూలంగా ఉండాలి.. మిగతా ప్రజాస్వామ్య ప్రక్రియల మాదిరిగానే ఉండాలి. ప్రజలు మిమ్మల్ని కూడా గమనిస్తున్నారు. మీ కోసం స్వీయ నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించుకుంటే, అది దేశానికి మేలు చేస్తుంది. ’’ అని న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అన్నారు.

మద్యం మత్తులో విమానంలో గొడవ... సిబ్బంది వేలు కొరికేసి...!

ఒక పార్లమెంట్ మెంబర్ అభ్యంతరకరమైన పదాలను ఉపయోగిస్తే.. ఆయనకు పగ్గాలు వేయడానికి నిబంధనలు ఉన్నాయని కిరెన్ రిజుజు తెలిపారు. దీంతో పాటు ప్రధాని నుంచి కిందిస్థాయి వరకు ప్రజలు నిబంధనలకు కట్టుబడి ఉంటారని గుర్తు చేశారు. ‘‘కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియమం మన న్యాయ వ్యవస్థలో కూడా ఉండాలి. కొన్ని ఇన్ హౌస్ మెకానిజం న్యాయవ్యవస్థ లోపల తయారు చేయాలి. వారు దానిని నియంత్రిస్తారు. అది ఉత్తమమైనది. ఉపయోగకరంగా ఉంటుంది.’’అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios