Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ప్రజలు అందరి మాట వింటారు.. కానీ నిజాన్నే అంగీకరిస్తారు - ప్రధాని నరేంద్ర మోడీ

గుజరాత్ ప్రజలు అందరి మాట వింటారని, కానీ నిజాన్ని మాత్రమే అంగీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం నిర్వహించి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

People of Gujarat listen to everyone.. but accept the truth - Prime Minister Narendra Modi
Author
First Published Dec 5, 2022, 1:26 PM IST

గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన పోలింగ్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ప్రతీ ఒక్కరి మాట వింటారని, అయితే నిజాన్ని మాత్రమే అంగీకరిస్తారని అన్నారు. ఇది తమ స్వభావం అని చెప్పారు. ఈ ఎన్నికలను అద్భుతమైన రీతిలో నిర్వహించి, ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచినందుకు ఎన్నికల సంఘాన్ని ప్రధాని అభినందించారు.

ఆ ఎన్నికల్లో పాకిస్తానీలు పోటీ చేశారు.. నేడు రీపోలింగ్ .. వారు ఎలా పోటీ చేశారంటే? షాకింగ్ వివరాలివే

ఈ సందర్భంగా  హిమాచల్ ప్రదేశ్‌లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను, ఆదివారం ఢిల్లీలో మున్సిపల్ జరిగిన మున్సిపల్ ఎన్నికలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఓటర్లు ప్రజాస్వామ్య పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని ఆయన అన్నారు. “ప్రజాస్వామ్య వేడుకల కోసం నేను దేశ పౌరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నికల సంఘాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచుతూ చాలా అద్భుతమైన రీతిలో ఎన్నికలను నిర్వహించే గొప్ప సంప్రదాయాన్ని ఆ సంఘం అభివృద్ధి చేసింది.’’ అని తెలిపారు. 

అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్ హైస్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రానికి ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. కొద్దిసేపు క్యూలో నిలబడి ఓటు వేశారు. పోలింగ్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనకు స్వాగతం పలికేందుకు గుమిగూడిన జనసమూహానికి తన సిరా వేలును చూపించారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలోని తన అన్న సోమ మోడీ ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు.

కాగా ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ.. ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ లోని రాష్ట్ర, ఉత్తర ప్రాంతాలలో ఉన్న 14 జిల్లాల్లోని  93 స్థానాకు రెండో దశ ఎన్నికలు నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios