సబ్బు తినేస్తున్న యువతి, సూపర్ టేస్ట్ అంటూ వీడియో, ట్విస్ట్ ఏంటంటే..!
ఓ అమ్మాయి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దాంట్లో ఓ చేతితో హ్యాండ్ వాష్, మరో చేతిలో సబ్బు పట్టుకొని ఉంది. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుందో మీకు చెబుతాను అంటూ వీడియో మొదలుపెట్టింది.

ప్రపంచంలో మనకు తినడానికి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చిన ఫుడ్స్ వారు తింటూ ఉంటారు. కొందరికి విటమిన్ లోపం , లేదా కొన్ని జబ్బుల కారణంగా కొందరు వింత వింత ఆహారం తింటూ ఉంటారు, మట్టి, పిన్నీసులు లాంటివి మింగేవారు కూడా ఉన్నారు. అయితే, తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దాంట్లో ఓ చేతితో హ్యాండ్ వాష్, మరో చేతిలో సబ్బు పట్టుకొని ఉంది. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుందో మీకు చెబుతాను అంటూ వీడియో మొదలుపెట్టింది.
రెండింటినీ వాసన చూసింది. ఆ తర్వాత సబ్బు రుచిగా ఉంది అంటూ, సబ్బు తినేస్తుంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సబ్బు తినడం ఏంటి అని షాక్ అవ్వకండి. ఎందుకంటే, అది నిజంగా కేక్ కాదు. కేక్ లా తయారు చేసిన సబ్బు అది. ఆమె సబ్బు ఆకారంలో కేక్ తయారు చేసింది. సబ్బు మాత్రమే కాదు, సోప్ కేసు కూడా తయారు చేసింది. దానిని ఆమె కట్ చేసి చూపించింది. అది లోపల చాక్లెట్ కేకు. దీంతో, ఆమె తిన్నది సోప్ కాదు, చాక్లెట్ కేక్ అనే విషయం అర్థమైంది. దీంతో, వీడియో వైరల్ గా మారింది.
చాలా మంది నిజంగానే సబ్బు తిన్నామని అనుకున్నాం అంటూ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.