ప్రజలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు, సామాన్యులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని తెలిపారు. 

పెట్రోల్, డీజిల్ ధరల త‌గ్గింపు నిర్ణ‌యంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తమకు ఎప్పుడూ ప్రజలే ముఖ్యమని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. పెరిగిన ఇంధన ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం పెట్రోల్‌పై రికార్డు స్థాయిలో రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

‘‘ మాకు ఎప్పుడూ ప్రజలే ప్రథమం.. పెట్రోల్, డీజిల్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు సంబంధించిన నేటి నిర్ణ‌యం వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయి. మన పౌరులకు ఉపశమనం, మరింత సౌల‌భ్యం క‌లిగిస్తాయి. ’’ అని మోడీ ట్వీట్ చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్ర‌స్తావించారు. ‘‘ఉజ్వల యోజన కోట్లాది మంది భారతీయులకు ముఖ్యంగా మహిళలకు సహాయంగా ఉంటోంది. ఉజ్వల సబ్సిడీపై ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబ బడ్జెట్లపై చాలా ప్ర‌భావం చూపుతాయి. ’’ అని ఆయన అన్నారు. 

Scroll to load tweet…

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పరిస్థితులు స‌వాల్ గా ఉన్న‌ప్ప‌టికీ తాము నిత్యావసర వస్తువుల కొర‌త లేకుండా చూసుకున్నామ‌ని తెలిపారు. ‘‘ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా కొన్ని కొరతల నుంచి తప్పించుకోలేకపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేలా చూసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము ’’ ఆమె పేర్కొన్నారు. 

కేంద్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ నిర్ణ‌యాలు తీసుకుంటున్న ప్ర‌ధాన మంత్రికి హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు ఆయ‌న ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే భావాన్ని వ్య‌క్తం చేశారు. కాగా కేంద్రం ప్రకటించిన తర్వాత ఇంధనంపై రాష్ట్ర పన్నులను చౌహాన్ తగ్గించలేదని మాజీ మ‌ధ్య‌ప్ర‌దేవ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. 

Gyanvapi: జ్ఞానవాపి వివాదం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుండి దృష్టి మరల్చే ప్రయత్నం: శరద్ పవార్

ప్రధాని మోడీ ఎప్పుడూ సాధారణ పౌరుల పట్ల శ్రద్ధగా ఉంటార‌ని, గరీబ్ కళ్యాణ్ కోసం నిరంతరం ఎలా పని చేస్తారో ఇది మరోసారి రుజువు చేస్తుంద‌ని మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కాగా గత 8 సంవత్సరాలుగా దేశంలోని పేదలు, రైతులు, సాధారణ ప్రజలను కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటోంద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పించింది. గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధర రూ. 100 మార్కును తాకింద‌ని, కానీ కేవలం రూ. 9 తగ్గించడం న్యాయమెలా అవుతుంద‌ని ప్రశ్నించింది. ఇంధనంపై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలను కోరడం అర్థరహితమని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. మరోవైపు ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించాలని మహారాష్ట్ర సీఎం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ముందుగా ధరలు పెంచి ఆ తర్వాత నామమాత్రంగా రేట్లు తగ్గిస్తున్నట్లు నటించడం సరికాదన్నారు. 

Amit Shah: నూత‌న విద్యా విధానంపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

కాగా.. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, ఇతర లెవీలపై దాని ప్రభావాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మొత్తంగా లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 9.5, డీజిల్‌పై రూ. 7 తగ్గ‌నుంది. ఢిల్లీలో పెట్రోలు ధర గతంలో రూ. 105.41 ఉండగా ఇప్పుడు లీటర్ ధర రూ. 95.91గా కానుంది. డీజిల్ ధర లీటరు రూ. 96.67 ఉండగా త‌గ్గింపు నిర్ణ‌యం త‌రువాత రూ. 89.67గా మార‌నుంది.