Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్‌పై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్: సుప్రీం వ్యాఖ్యలకు స్వాగతించిన కాంగ్రెస్ నేత


పెగాసెస్ పై తాము చేసిన ఆరోపణలు నిజమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చూస్తే అర్ధమౌతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. పెగాసెస్ పై ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Pegasus is an attempt to crush Indian democracy: Rahul Gandhi
Author
New Delhi, First Published Oct 27, 2021, 5:07 PM IST

న్యూఢిల్లీ: పెగాసెస్‌పై తాము చేసిన ఆరోపణలు నిజమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చూస్తే అర్ధమౌతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Pegasus పై Supreme Court  వ్యాఖ్యలను Rahul Gandhi స్వాగతించారు. పెగాసెస్‌ను భారత్‌కు ఎవరు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.పెగాసెస్ నిఘా భారత ప్రజాస్వామ్యంపై దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.

also read:Pegasus Issue: పౌరుల గోప్యతే ముఖ్యం.. కేంద్రానికి సుప్రీం అంక్షింతలు, విచారణకు కమిటీ నియామకం

పెగాసెస్ అంశంపై ఆయన మూడు ప్రశ్నలు సంధించారు.  పెగాసెస్ ను ఏ ప్రభుత్వ సంస్థ ఆమోదించిందని ఆయన ప్రశ్నించారు. ఎవరిపై పెగాసెస్ ను ప్రయోగించారో చెప్పాలన్నారు. మన సమాచారాన్ని ఇతర దేశాలు ఏమైనా యాక్సెస్ చేశాయా అని ఆయన  ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని, బీజేపీ మంత్రులకు వ్యతిరేకంగా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సమాచారం ప్రధాని మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చేరిందా అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల కమిషన్, విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి ప్రధానికి సమాచారం అందిస్తే  అది నేరమేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

పెగాసెస్ అంశంపై పార్లమెంట్ లో తాము ప్రస్తావిస్తే ప్రభుత్వం స్పందించలేదన్నారు. పెగాసెస్ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.పెగాసెస్ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ  ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రవీంద్రన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోందని సుప్రీంకోర్టు ఇవాళ వెల్లడించింది.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios