పాకిస్తాన్‌తో చర్చలే దానికి పరిష్కారం.. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం

జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి పాకిస్తాన్‌తో చర్చలు చేపట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు నిర్వహించే వరకు శాంతి నెలకొనదని తెలిపారు. అధికరణం 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చని చెప్పినవారందరికీ నేటి పరిస్థితులే కనువిప్పు అని వివరించారు.
 

peace will establish after talks with pakistan says jammu kashmir former CM farooq abdullah

శ్రీనగర్: Jammu Kashmir మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ Farooq Abdullah కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే కచ్చితంగా Pakistanలో చర్చలు జరగాల్సిందేనని అన్నారు. పాకిస్తాన్‌తో Talks నిర్వహించే వరకు జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొనబోదని వివరించారు. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని హక్కులను భారత్ కాలరాసిందని ఆరోపించారు. 1947లో పాకిస్తాన్ పిచ్చిపని చేయకపోయి ఉంటే జమ్ము కశ్మీర్ సంస్థానాన్ని చివరి పాలకుడు మహారాజ హరిసింగ్ స్వతంత్రంగానే ఉంచేవాడని అన్నారు. లోయలో ప్రస్తుత పరిస్థితులు కశ్మీరీ పండిట్లు తిరిగి రావడానికి అనుకూలంగా లేవని వివరించారు.

జమ్ము కశ్మీర్‌లో పూంచ్, రాజౌరీలో మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పూంచ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370, 35ఏలను నిర్వీర్యం చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అమిత్ షా తన పర్యటనలో కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ముందు చేపడతామని, ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెప్పారని, ఆయన వ్యాఖ్యలే జమ్ము కశ్మీర్‌పై కేంద్రానికి ఉన్న వికారమైన ఆలోచనలను వెల్లడిస్తున్నాయని విమర్శించారు.

Also Read: జమ్ము కశ్మీర్‌లో మరో పౌరుడి దుర్మరణం.. ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ఘటన

బీజేపీ ప్రభుత్వం మతం ఆధారంగా విభజనలు చేస్తున్నదని మండిపడ్డారు. టెర్రరిస్టుల చేతిలో కేవలం హిందువులే కాదు.. ముస్లింలూ హతమవుతున్నారని గుర్తుచేశారు. జమ్ము కశ్మీర్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కపటంగానే వ్యవహరించిందని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌ నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చని కొందరు భావించారని, నేటి పరిస్థితులే వారికి కనువిప్పు అని వివరించారు.

నేషనల్ కాన్ఫరెన్స్‌ను అధికారంలోకి తెస్తే ఆర్టికల్ 370, 35ఏ అధికరణాలను పునరుద్ధరిస్తామని హామీనిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios