Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్‌గా రాజీనామా చేశారు. కొత్త డైరెక్టర్లతో బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ సజావుగా సాడానికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు.
 

paytm founder resigned for paytm payment bank limited chairman kms
Author
First Published Feb 26, 2024, 9:22 PM IST

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్‌గా రాజీనామా చేశారు. ఆర్బీఐ పేటీఎం బ్యాంక్‌కు మార్చి 15వ తేదీ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. పీపీబీఎల్ కొత్తగా బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో కొత్త బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బరోడా బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్‌లు సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. 

Also Read: BRS: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి

ఈ మార్పు ప్రక్రియ కొనసాగడానికి పేటీఎం పేమెంట్ బ్యాంక్ బోర్డు నుంచి చైర్మన్‌గా విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారని ఆ కంపెనీ ప్రత్యేకంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త చైర్మన్ నియామకానికి సంబంధించి ప్రక్రియ గురించి త్వరలోనే  వెల్లడిస్తామని ఆ కంపెనీ వివరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios