Asianet News TeluguAsianet News Telugu

BRS: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి

బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డిలు హస్తం పార్టీలో ఈ  రోజు చేరారు.
 

former mla teegala krishna reddy quits brs joined congress party kms
Author
First Published Feb 26, 2024, 8:16 PM IST | Last Updated Feb 26, 2024, 8:16 PM IST

బీఆర్ఎస్ నాయకుడు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, కృష్ణా రెడ్డి కోడలు అనితా రెడ్డిలు ఈ రోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిబ్రవరి 26వ తేదీన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపా దాస్ మున్షి సమక్షంలో వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తీగల కృష్ణా రెడ్డి హైదరాబాద్ మాజీ మేయర్.

గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దీన్, మోతె శ్రీలత శోభన్ రెడ్డిలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ చేర్పులు జరుగుతున్నాయి. తాజాగా, తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read: విశాఖ బీచ్‌లో ప్రారంభించిన ఒక్కరోజులోనే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జీ

తీగల కృష్ణా రెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి ప్రారంభమైంది. టీడీపీ నుంచే ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌ ఎన్నికల్లో 1986లో పోటీ చేశారు. 2002లో ఆయన హైదరాబాద్ మేయర్‌గా గెలిచారు. 2007 వరకు కొనసాగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios