ఆపరేషన్ థియేటర్‌లో మహిళ ప్రైవేట్ పార్టులను టచ్ చేస్తూ అసభ్యకర ప్రవర్తన.. పోలీసుల దర్యాప్తు
పశ్చిమ బెంగాల్‌లో ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లోనే ఓ స్టాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనస్థీషియాతో మత్తులో ఉన్న మహిళ ప్రైవేట్ పార్టులను అతను అసభ్యకరంగా తాకాడని, ఆమె చెస్ట్ కుడి వైపున తాకినట్టూ మరకలు ఉన్నాయని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లో ఇంకా అనస్థీషియా మత్తు పూర్తిగా దిగికముందు ఓ మహిళా పేషెంట్‌పై ఓ హాస్పిటల్ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్టులను టచ్ చేసి వికృతానందానికి ప్రయత్నించాడు. పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
9 ఏళ్ల మహిళ గాల్ బ్లాడర్ సర్జరీ కోసం కోల్‌కతాలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేరారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. ఉదయం 11 గంటలకల్లా సర్జరీ అయిపోయింది. ఆ తర్వాత ఆమె సెమీ కాన్షియస్ స్టేట్‌లో ఉన్నది. ఇంకా పూర్తిగా మత్తు వదలని ఆ పరిస్థితిలో ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్టులను టచ్ చేసినట్టు గుర్తించింది.
‘నాకు కుడి వైపున నిలుచున్న వ్యక్తి తన బాడీపై చేతులు వేసి టచ్ చేశారని తెలిపింది. అది చాలా బాధకరంగా అనిపించిందని చెప్పింది. మెల్ల మెల్లగా నాకు స్పృహ వచ్చిన కొద్దీ ఎవరో నా బాడీని అసభ్యకరంగా టచ్ చేశారనే విషయాన్ని తెలుసుకోగలిగానని పేర్కొంది. తాను మొత్తం ఫీల్ అవుతున్నానని, కానీ, అనస్థీసియా ప్రభావంలో ఉండటం మూలంగా వారిని ఆపలేకపోయానని వివరించింది. తన కళ్లు తెరిచిన తర్వాత తన ప్రైవేట్ పార్టులపై మార్క్స్‌ను నోటీస్ చేయగలిగిందని పేర్కొంది.
Also Read: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్ లో పోలీసులకు ఊరట: ఆదిలాబాద్ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే
తనపై ఆ నేరం జరుగుతున్నప్పుడు ఒక్క మహిళా సిబ్బంది కూడా లేరని, ఆపరేషన్ థియేటర్‌లో మొత్తం ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ, తన చాతి కుడి భాగంలో తడిమిన మరకలు కనిపించాయని వివరించింది. ఫూల్‌బగన్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చింది.
ఆమె ఫిర్యాదు మీదనే కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మెడికల్ టెస్టు కూడా చేశారు.
ఇది చాలా సీరియస్ ఆరోపణలు అని, ఐపీసీలోని 354 సెక్షన్ కింద గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేశారని డీసీపీ ప్రియాబ్రాతో రాయ్ వివరించారు.