మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్ లో పోలీసులకు ఊరట: ఆదిలాబాద్ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే

మావోయిస్టు అగ్రనేత  ఆజాద్,  జర్నలిస్ట్ హేమచంద్ర పాండే  ఎన్ కౌంటర్  పై  ఆదిలాబాద్  కోర్టు తీర్పుపై  తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది.  

Telangana High Court  Stays  on Adilabad  Court  Verdict  over maoist  azad encounter

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత  ఆజాద్ , జర్నలిస్టు హేమచంద్ర పాండే   ఎన్ కౌంటర్ పై  ఆదిలాబద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు  స్టే విధించింది.  ఆదిలాబాద్ కోర్టు  ఇచ్చిన తీర్పుపై  పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన   హైకోర్టు  స్టే విధించింది,. 2010  జూలై  1న ఉమ్మడి  ఏపీ రాస్ట్రంలోని  ఆదిలాబాద్ జిల్లాలోని  సిర్పూర్ కాగజ్ నగర్  కు  సమీపంలోని  సర్నేపల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ లో మృతి చెందారు.  ఆజాద్ తో పాటు జర్నలిస్ట్  హేమచంద్రపాండే కూడా  ఈ  ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. 

ఈ ఎన్ కౌంటర్  పై  హక్కుల సంఘాలు  అనుమానాలు వ్యక్తం  చేశాయి. ఈ విషయమై  ఆజాద్ భార్య  కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ  ఎన్ కౌంటర్ లో పాల్గొన్న  పోలీసులను విచారించాలని  ఆజాద్ భార్య పద్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను  2015  మార్చి 24న కొట్టివేసింది.  మరో వైపు  ఈ కేసును పునర్విచారణ చేయాలని ఆదిలాబాద్ కోర్టు  2016 ఫిబ్రవరి  15న కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు  కోర్టు నోటీసులు జారీ చేసింది.  దీంతో  పోలీసులు తెలంగాణ హైకోర్టులో  సవాల్  చేశారు. ఈ కేసుతో  సంబంధం  ఉన్న 29 మంది పోలీసుల వాదనలను కూడా వినాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు సూచించింది. మూడు నెలల్లో  ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.   ఈ విషయమై  పోలీసులు  రివిజన్ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది తెలంగాణ హైకోర్టు.  ఆదిలాబాద్  కోర్టు  ఆదేశాలపై  స్టే  ఇచ్చింది.    
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios