Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు డాక్టర్లపై కత్తితో దాడి చేసిన పేషెంట్.. విధులను నిలిపివేసి ఆందోళనకు దిగిన డాక్టర్లు

మహారాష్ట్ర యవత్మాల్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఓ పేషెంట్ ఇద్దరు డాక్టర్లపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Patient attacked two doctors with a knife. The doctors who stopped their duties and became agitated
Author
First Published Jan 6, 2023, 3:18 PM IST

ఇద్దరు డాక్టర్లపై ఓ పేషెంట్ కత్తితో దాడికి దిగాడు. దీంతో వారికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ డాక్టర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఎమర్జెన్సీ సేవలతో పాటు నాన్ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసింది.

పశ్చిమ బెంగాల్ స్కూల్ మిడ్ డే మీల్స్ లో చికెన్, సీజనల్ ఫ్రూట్స్.. ఓట్ల కోసమే అని విమర్శించిన బీజేపీ

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యవత్మాల్ లోని శ్రీ వసంతరావు నాయక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గురువారం సూరజ్ ఠాకూర్‌ అనే పేషెంట్ రెసిడెంట్ డాక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. దీనిని గమనించిన మరో డాక్టర్ అక్కడికి చేరుకొని బాధితుడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా గాయాలయ్యాయి.

ఈ దాడిని నిరసిస్తూ మెడికల్ కాలేజీ డాక్టర్ల సంఘం తరుఫున ఎమర్జెన్సీ సేవలు, నాన్ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసింది. ఈ ఘటనపై యావత్మాల్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..‘‘నిందితుడు సూరజ్ ఠాకూర్‌ కు మానసిక స్థితి సరిగా లేదు. దీంతో రెండు రోజుల కిందట తనను తాను పొడుచుకున్నాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు యవత్మాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేర్చారు. డాక్టర్ పేషెంట్లను పరిశీలించేందుకు వచ్చిన సమయంలో నిందితుడు కత్తితో దాడి చేశారు. అతడిని అరెస్టు చేశాం ’’ అని తెలిపారు.

కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని కాపాడితే.. బీజేపీ మ‌తం, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తోందంటూ ఖర్గే ఫైర్

యవత్మల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక రోగి రెసిడెంట్ డాక్టర్పై కత్తితో దాడి చేసినట్లు బీఎంసీ ఎంఏఆర్డీ అధ్యక్షుడు ప్రవీణ్ ధాగే ధృవీకరించారు. బాధిత డాక్టర్ చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ‘‘ ఇది మొదటి సంఘటన కాదు. ఇంతకు ముందు కూడా ఒక ఎంబీబీఎస్ విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. అక్కడ భద్రతను పెంచాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దాడుల నేపథ్యంలో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

దేశంలో కొత్త‌గా 228 క‌రోనా వైర‌స్ కేసులు.. న‌లుగురు మృతి

కాగా.. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న డాక్టర్లు తమకు భద్రత కల్పించాలని, అలాంటి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios