పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఓ పాస్టర్ మహిళపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. ఆ తరువాత అబార్షన్ చేయించేక్రమంలో ఆమె మృతి చెందింది. దీంతో పాస్టర్‌పై కేసు నమోదైంది.
పంజాబ్ : పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై చర్చి పాస్టర్ అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. కాగా, అబార్షన్ చేయించుకోవాలని ఆమె మీద ఒత్తిడి తెచ్చాడు. ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించడం కోసం "అండర్ ట్రైన్డ్" నర్సుతో ప్రయత్నించాడు.
అబార్షన్ అయిన తరువాత ఇన్‌ఫెక్షన్ సోకడంతో 21 ఏళ్ల ఆ మహిళ మరణించింది.తమ ఇంటి దగ్గర ఉన్న చర్చిలో ఉండే జషన్ గిల్ అనే పాస్టర్.. తరచుగా చర్చికి వెళ్లే తమ కుమార్తెపై అత్యాచారం చేశాడని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.
అతని అఘాయిత్యంతో తమ కూతురు గర్భవతి కావడంతో అండర్‌ట్రైన్డ్ నర్సు సతీందర్జీత్ కౌర్ అలియాస్ బాబ్లీని ఆమెకు అబార్షన్ చేసేలా ఒప్పించాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అజాగ్రత్తగా అబార్షన్ చేయడం వల్ల తమ కుమార్తెకు ఇన్ఫెక్షన్ సోకిందని, వెంటనే ఆమెను గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ ఆమె మరణించిందని వారు తెలిపారు.
వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.నర్సు, పాస్టర్‌పై కేసు నమోదు చేశామని, ఇద్దరినీ త్వరలో అరెస్టు చేస్తామని దీనానగర్ ఎస్‌హెచ్‌ఓ జతీందర్ పాల్ తెలిపారు.
