భారతీయ రైల్వే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ప్రయాణికులకు ఇబ్బందిగా మారనుంది. రాత్రిపూట రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తన సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు ఛార్జింగ్ చేసుకోలేరు.

రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లను రాత్రిపూట ఆపేయనున్నారు. ఇటీవలి కాలంలో రైళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రైల్వే సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ రాత్రివేళ రైళ్లలో ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఛార్జింగ్ చేసుకునే అవకాశాన్ని ఎత్తేయడమనేది రైల్వేశాఖ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.. అన్నారు. 

ఇక మీదట రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లు రాత్రి 11గం.లనుంచి ఉదయం 5 గం.ల వరకు బంద్ చేయనున్నారు. డెహ్రాడూన్ వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఇదేవిధంగా రాంచీలోనూ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదాల దరిమిలా రైల్వేశాఖ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.