Asianet News TeluguAsianet News Telugu

విమానంలో వాష్‌రూమ్ రగడ... ఎయిరిండియా పైలట్‌పై ప్రయాణికుడి ఫిర్యాదు

ఎయిరిండియా విమానంలో వాష్‌రూమ్‌ వినియోగించడానికి పైలెట్ అభ్యంతరం చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రయాణికుడు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 

passenger filed Complaint on air india pilot for object to toilet use
Author
First Published Nov 8, 2022, 5:55 PM IST

ఎకానమీ క్లాస్ ప్రయాణికుడు.. బిజినెస్ క్లాస్‌లో వున్న టాయిలెట్‌ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపిన ఎయిరిండియా పైలట్‌ వివాదానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కోజికోడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ విమాన ప్రయాణికుడు బీపీ పడిపోవడంతో అతను విమానంలో వున్న వైద్యుల సాయం కోరాడు. ఇదే సమయంలో అతను అత్యవసరంగా బాత్రూమ్‌కి వెళ్లాల్సి రావడంతో బిజినెస్ క్లాస్‌లో వున్న వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అయితే ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు బిజినెస్ క్లాస్‌లో వున్న బాత్రూమ్‌ని వాడేందుకు పైలెట్, విమాన సిబ్బంది అభ్యంతరం తెలిపారు. 

ALso Read:విమానంలో కనిపించిన పాము.. భయంతో బెదిరిపోయిన ప్రయాణికులు.. చివరకు ఏమైందంటే?

అయితే ఎకానమీ క్లాస్‌ వాష్‌రూమ్‌లు బ్లాక్ చేయడం వల్లే బిజినెస్ క్లాస్ వాష్‌రూమ్‌ని ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేదని ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత విమాన సిబ్బంది, పైలెట్‌పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ స్పందించారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఎక్కువ ఛార్జిలు చెల్లించడం వల్లే ఎకానమీ క్లాస్ వాష్‌రూమ్‌ను వినియోగించేందుకు అనుమతించరని చెప్పారు. అయితే అసాధారణ పరిస్ధితుల్లో ఈ నిబంధన వర్తించదని భార్గవ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios