Asianet News TeluguAsianet News Telugu

విమానంలో కనిపించిన పాము.. భయంతో బెదిరిపోయిన ప్రయాణికులు.. చివరకు ఏమైందంటే?

ఫ్లోరిడాలోని తంపా నుంచి యూఎస్ విమానం టేకాఫ్ అయింది. ఇంతలోనే ప్రయాణికుల మధ్యలోకి ఓ పాము వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భీతిల్లిపోయారు. వెంటనే ఫ్లైట్ క్రూకు తెలియజేశారు.
 

snake on plane.. flight passengers scared.. know what happened
Author
First Published Oct 19, 2022, 5:12 PM IST

న్యూఢిల్లీ: అమెరికా విమానంలో హఠాత్తుగా ఓ పాము దర్శనమైంది. విమానం టేకాఫ్ అయ్యాక ఈ పాము బయట కనిపించడంతో కలకలం రేగింది. విమాన ప్రయాణికులంతా ఒక్కసారిగా బెదిరిపోయారు. ఏం చేయాలో పాలుపోక వెంటనే ఫ్లైట్ క్రూకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది.

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని తంపా నుంచి న్యూజెర్సీకి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2038 బయల్దేరింది. అయితే, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అనుకోకుండా ప్యాసిజంర్‌ల మధ్యలోకి ఓ పాము వచ్చింది. ఆ పామును చూడగానే ప్రయాణికులు ఘొల్లుమన్నారు. భయంతో ముఖాలు ఎర్రబడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే ఫ్లైట్ సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే అప్రమత్తం అయ్యారు. పాము నుంచి ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read: రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం స్మగ్లింగ్..ఎక్కడంటే..

ఆ విమానం సోమవారం మధ్యాహ్నం నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే ఆ పామును సేఫ్‌గా విమానం నుంచి బయటకు తీసుకెళ్లారు. వైల్డ్ లైఫ్ ఆపరేషన్స్, పోర్ట్ అథారిటీ పోలీసుల శాఖ ఆ పామును విమానం నుంచి తొలగించింది. ఆ తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. 

ఈ పాము విషపూరితమైనది కాదని అధికారులు చెప్పినట్టు రాయిటర్స్ పేర్కొంది. ఈ పాము కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ పై దీని ప్రభావం ఏమీ లేదని అధికారులు పేర్కొన్నారు.

గతంలోనూ ఇలా విమానంలో పాములు కనిపించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 2016లో మెక్సికో సిటీకి వెళ్తున్న ఎరోమెక్సికో విమానంలోనూ ఓ పెద్ద పాము కనిపించింది. అంతేకాదు, 2013లోనైతే ఏకంగా ఓ భారీ కొండసిలువనే ప్రయాణికులు చూశారు. ఆ విమానం ఆస్ట్రేలియా నుంచి పాపువా న్యూ గినియాకు వెళ్లుతుండగా ఈ పాము కనిపించి కంగారు పెట్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios