Parrot Missing: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు చిలుక కనిపించకుండాపోయిందని ఓ కుటుంబం ఆందోళన చెందుతుంది. దాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతిగా పది వేలు నగదు ఇస్తానని ప్రకటించింది. అంతేగాక పలు చోట్ల పోస్టర్లు అంటించడంతోపాటు వాహనాల్లో తిరుగు ప్రచారం చేయిస్తున్నారు. 

Parrot Missing: అన్ని పక్షుల్లోకెళ్లా.. రామచిలుక చాలా ప్ర్తత్యేకం.. వాటి పలుకులు వినసొంపుగా ఉంటాయి. అవి మనుషుల మాటలను వింటూ.. అనుకరించే ప్రయత్నం చేస్తాయి. ఆ చిలుక పలుకులకు ఎవ్వరైనా దాసోహం కావాల్సిందే. మనం వాటిపై కాసింత ప్రేమను కురిపిస్తే చాలు.. మనతో పెనవేసుకుంటాయి. మన ఇంట్లో సభ్యురాలుగా మరిపోతాయి. వాటితో ఉండే అనుబంధం.. పొందే ఆనందం.. నిజంగా వాటిని పెంచుకునే వారికి తెలుసు.

ప్రేమను.. అనురాగాన్ని కురిపిస్తూ.. ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా మారినా చిలుక కనిపించకుండా పోతే.. ఎలా ఉంది. ఆ బాధ ఎలా ఉంటుంది. అలాంటి బాధనే మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఓ కుటుంబం ఎదుర్కొంటుంది. తాము పెంపుడు చిలుక కనిపించకుండా పోయిందనీ, దాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతిగా పది వేలు నగదు ఇస్తానని ఆ కుటుంబం ప్రకటించింది. దీంతో పాటు చిలుకల అదృశ్యంపై నగర వ్యాప్తంగా పోస్టర్లను కూడా అంటించారు. అలాగే.. వాహనాలతో తిరుగుతూ.. ప్రచారం చేయిస్తున్నారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో నివాసం ఉండే.. దీపక్ సోనీ కుటుంబీకులు గత రెండేళ్లుగా ఓ రామచిలుకను పెంచుకుంటున్నారు. కానీ ఇటీవల ఆ రామ చిలుక కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన ఆ కుటుంబం దానిని వెతికే పనిలో పడ్డారు. రాత్రిపగలు తేడా లేకుండా.. చెట్టు పుట్ట కలియ తిరుగుతున్నారు. అయినా.. దాని ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయల క్యాష్‌ ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా నగరమంతాట అంటించారు. మరోవైపు.. వాహనంలో మైక్‌లు ఏర్పాటు చేసుకుని.. తప్పిపోయిన చిలుకను వెతికి తెచ్చిన వారికి పదివేల రూపాయాలను అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో దీపక్‌ (చిలుక యాజమాని) మీడియాతో మాట్లాడుతూ.. తప్పిపోయిన చిలుకతో తమ కుటుంబానికి రెండేండ్లుగా అనుబంధం ఉందని తెలిపాడు. ఆ చిలుక అంటే.. ఇంట్లో అందరికీ ఇష్టమని చెప్పాడు. చిలుక ఇంట్లో స్వేచ్చగా తిరుగుతూ.. ఎన్నో రకాల శబ్దాలు చేస్తూ.. సంతోష పరిచేదని , తమను పేర్లు పెట్టి పిలిచేదని చెప్పుకోచ్చాడు.

అయితే.. గత వారం తన తండ్రి చిలుకను వెంటబెట్టుకుని తీసుకెళ్లగా.. ఇంతలో కుక్కలు మొరగడంతో భయంతో ఎగిరి పోయిందని అన్నారు. అప్పటి నుంచి చిలుక జాడ కనిపించలేదన్నాడు. ఆ చిలుక సరిగ్గా ఎగురలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. చిలుక గురించి సమాచారం తెలిపిన వారికి ప్రకటించిన పది వేల నగదు కంటే ఎక్కువగానే ఇస్తానని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.