పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు పార్టీల నేతలు ఈ ప్రతిపాదన చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సభకు హాజరవ్వడం లైఫ్ రిస్కేనని అభిప్రాయపడ్డారు.

ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోలేమని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. సభను ముందుగానే ముగించే అంతిమ నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనే  ఎంపీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ టెస్టుల్లో 30 మంది ఎంపీలకు పాజిటివ్‌గా తేలింది. వీరిలో పలువురు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు.