Parliament winter session: ప్రారంభమైన పార్లమెంట్ శీతకాల సమావేశాలు.. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament winter session 2021) ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ (Lok Sabha) వాయిదా పడింది.
పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament winter session 2021) ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ (Lok Sabha ) ప్రారంభం కాగానే ఇటీవల ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఇటీవలి కాలంలో మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ నివాళులర్పింది. ఆ తర్వాత రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఫ్లకార్డులతో సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) సభ మర్యాదను పాటించాలని సభ్యలకు సూచించారు. అయితే విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
రాజ్యసభ గంట పాటు వాయిదా..
రాజ్యసభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన సభ్యులకు నివాళుల అర్పించారు. అయితే సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతికి సంతాపంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను గంట పాటు వాయిదా వేశారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం పైనైనా చర్చకు, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు అని తెలిపారు. పార్లమెంట్‌లో సమస్యల గురించి ప్రస్తావించవచ్చని.. కానీ పార్లమెంట్, స్పీకర్ చైర్ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.
Also read: Parliament winter session: ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నూతన ఉత్తేజంతో రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రజలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యతకు శుభ సంకేతం అని వ్యాఖ్యానించారు.
రైతు సమస్యలపై కాంగ్రెస్ నిరసన
రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు.
Also read: Parliament winter session: కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు.. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
ఇక, పార్లమెంట్ సమావేశాల తొలి రోజే.. సాగు చట్టాల రద్దు (repealing of three farm laws) బిల్లును సభ ముందుకు తీసుకురావాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది. అలాగే పలు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది. అయితే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతపై, సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకు వస్తుందని అనుమానిస్తున్న విపక్షాలు.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరంగా సమాధానం చెప్పాలిన డిమాండ్ చేయనున్నాయి.