మూక దాడులపై కొత్త చట్టం: రాజ్‌నాథ్ సింగ్

Parliament updates live:Loksabha over mob violence
Highlights

 పార్లమెంట్‌లో మూకదాడులపై మంగళవారం నాడు విపక్షాలు  ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం మూకదాడులకు మద్దతుగా నిలుస్తోందని విమర్శలు గుప్పించాయి విపక్షాలు


న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మూకదాడులపై మంగళవారం నాడు విపక్షాలు  ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం మూకదాడులకు మద్దతుగా నిలుస్తోందని ఆరోపించాయి విపక్షాలు. రాజస్థాన్‌లోని అల్వార్  దాడి ఘటనపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. మూకదాడులపై కొత్త చట్టాన్ని తెస్తామని రాజ్‌నాథ్ ప్రకటించారు.

మంగళవారం నాడు పార్లమెంట్‌లో మూకదాడులపై  చర్చ జరిగింది. ప్రభుత్వ తీరును విపక్షాలు  తప్పుబట్టాయి.  దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో మూక దాడులు చోటు చేసుకొన్న విషయాలను  విపక్షాలు ప్రస్తావించాయి.  మూకదాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.

మరో వైపు  మూకదాడులకు ప్రభుత్వం  మద్దతుగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది.అయితే ఈ ఆరోపణలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  ఖండించారు.  మూకదాడులపై కేంద్రం అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని రాజ్‌నాథ్ సింగ్  ప్రకటించారు.  

రాజస్థాన్‌లోని అల్వార్ దాడి ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన  అత్యున్నత కమిటీ విచారణ చేస్తోందన్నారు.ఈ కమిటీ నివేదిక ప్రకారంగా చర్యలు తీసుకొంటామని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. మరోవైపు మూకదాడులు ఇప్పుడే కాదు... చాలా కాలం నుండి జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

ఈ ఘటనపై నాలుగు వారాల్లో  నివేదికను  ఇవ్వనుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. మరో వైపు  మూకదాడులపై కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న విషయాన్ని  రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 

loader