తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి పార్లమెంట్ నివాళి అర్పించింది. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు... అనంతరం సభ్యులంతా లేచి ఓ నిమిషం పాటు మౌనం పాటించారు.

మరోవైపు రాజ్యసభలోనూ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కలైంజర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.. సభ్యులంతా ఆయనకు సంతాపం ప్రకటించి.. ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. కరుణానిధికి గౌరవ సూచికంగా ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.. తిరిగి రేపు యధావిధిగా పార్లమెంట్ సమావేశమవుతుంది.