సారాంశం
పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త పార్లమెంట్ భవనంలోకి ఎంపీలు ఇవాళ మధ్యాహ్నం ప్రవేశించారు. ప్రధాని మోడీ సహా పలువురు మంత్రులు, ఎంపీలు పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టారు.
న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనంనుండి కొత్త పార్లమెంట్ భవనంలోపలికి ఎంపీలు అడుగు పెట్టారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త పార్లమెంట్ భవనానికి పాదయాత్రగా చేరుకున్నారు.
పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ లో మంగళవారంనాడు ఎంపీల సమావేశం ముగిసింది.
ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు ఎంపీలు పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు. పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త పార్లమెంట్ భవనానికి ఎంపీలు పాదయాత్రగా వెళ్లారు.