Parliament Attack: గెలుపో.. ఓటమో.. కానీ,: పార్లమెంటులో దాడికి ముందు ఇన్‌స్టాలో నిందితుడు సాగర్ శర్మ పోస్టు

పార్లమెంటులో భద్రతను ఉల్లంఘించి లోక్ సభలోకి దూసుకెళ్లి అలజడి సృష్టించిన వారిలో సాగర్ శర్మ ఒకడు. ఆయన ఈ చర్యకు పాల్పడటానికి ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. గెలుపో, ఓటమో.. ప్రయత్నం మాత్రం జరిగి తీరుతుంది అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ కలుస్తామనే ఆశ ఉన్నది అని ఆ ఇన్‌స్టా పోస్టుల హిందీ భాషలో రాశాడు.
 

parliament security breach accused sagar sharma instagram post before intruding says jeete ya haare kms

Parliament Security Breach: పార్లమెంటు దిగువ సభలో నిన్న కొందరు ఆగంతుకులు పాల్పడిన ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మన దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశాల్లో ఒకటైన పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలర్ స్మోక్‌తో అలజడి రేపారు. ఆ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో సాగర్ శర్మ ఒకడు.

2001 పార్లమెంటు దాడి జరిగిన రోజునే నేడు లోక్ సభలోకి వీరు చొచ్చుకెళ్లారు. భద్రతను ఉల్లంఘించి లోక్ సభలోకి వెళ్లడానికి ముందు సాగర్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్టు రాశాడు. ఇన్‌స్టాలో హిందీ భాషలో ఆయన ఈ పోస్టు చేశాడు.

గెలుపో.. ఓటమో.. ప్రయత్నం మాత్రం జరుగుతుంది అని సాగర్ శర్మ పేర్కొన్నాడు. మళ్లీ కలుస్తామనే ఆశ మాత్రం ఉన్నది అంటూ తెలిపాడు. మరో పోస్టులో కలలను నిజం చేసుకోవడం గురించి రాశాడు. ‘ఈ జీవితంలో బహుసుందరమైనవేమైనా ఉన్నాయంటే అది కలలే. మనం ఎందుకు జీవిస్తున్నాయో పగలు, రాత్రి అవి గుర్తు చేస్తుంటాయి. కలలు లేని జీవితం అర్థరహితం. ఆ కలలను నిజం చేసుకోవడం కోసం కృషి సల్పకపోవడం జీవితాన్ని మరింత నిరర్థకం చేస్తుంది’ అని తెలిపాడు.

Also Read: Parliament Security Breach: 2001 లో పార్ల‌మెంట్ పై ఉగ్ర‌దాడి ఎలా జ‌రిగిందంటే..?

మనోరంజన్ డీతోపాటు శర్మ భద్రతను ఉల్లంఘించి లోక్ సభలోకి దూసుకెళ్లారు. జీరో అవర్ సెషన్ జరుగుతుండా వీరిద్దరూ పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్ సభ చాంబర్‌లోకి వెళ్లారు. వారు పసుపురంగు వాయువును కంటైనర్ల నుంచి విడుదల చేశారు. దీంతో పార్లమెంటు చాంబర్‌లో అలజడి రేగింది. మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం కలర్ గ్యాస్‌ను స్ప్రే చేశారు. తానాషాహీ నహీ చలేగీ(నిరంకుశత్వం ఇకపై చెల్లదు!) అని బిగ్గరగా అరుస్తూ ఈ గ్యాస్ స్ప్రే చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios