Parliament Security Breach: 2001 లో పార్ల‌మెంట్ పై ఉగ్ర‌దాడి ఎలా జ‌రిగిందంటే..? 

2001 Parliament attack: సరిగ్గా 22 ఏళ్ల క్రితం డిసెంబర్ 13న కూడా పార్లమెంటుపై దాడి జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 18 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ళ్లీ స‌రిగ్గా నేడు పార్ల‌మెంట్ లో భ‌ద్ర‌తా ఉల్లంఘన జ‌రిగింది. 

Parliament Security Breach: Parliament attack in 2001, When it was more than smoke 22 years ago KRJ

Parliament attack: పార్ల‌మెంట్ లో దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొందరు దుండ‌గులు క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారు. దీంతో భారతదేశపు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకదాని భద్రతను ఉల్లంఘించడమే. 2001 నవంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడి మార‌ణ‌హోమం స్రుష్టించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయింది. 2001లో జరిగిన పార్లమెంటుపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ బుధవారం లోక్ స‌భ‌లో భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇద్దరు దుండగులు లోక్ సభ హాల్ లోకి చొర‌బ‌డి.. క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో దాడి చేశారు. బుధవారం జరిగిన దాడిలో కేవ‌లం క‌ల‌ర్ గ్యాస్ మాత్ర‌మే ఉన్నప్పటికీ, 2001లో జరిగిన దాడిలో ఎదురుకాల్పులు, ఆత్మాహుతి బాంబర్ పేలడం, మరణాలు సంభవించాయి.

ఆనాడు కలష్నికోవ్ రైఫిల్స్, బ్యాక్ ప్యాక్ లలో గ్రెనేడ్లు, ఇత‌ర ఆయుధాల‌తో కూడిన ఐదుగురు ఉగ్రవాదుల ఆత్మాహుతి దళం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడి చేసినవారిలో మానవ బాంబు పార్లమెంటు భవనం ముందు పేలింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. అదే సమయంలో 12 మంది భద్రతా సిబ్బంది, ఒక టీవీ కెమెరామెన్ సహా 18 మంది గాయపడ్డారు.  


2001 నవంబర్ 13న పార్ల‌మెంట్ పై దాడి ఎలా జ‌రిగిందనేది గ‌మ‌నిస్తే.. అప్ప‌ట్లో పార్ల‌మెంట్ భ‌వ‌నం చుట్టూ మూడంచెల భ‌ద్రతా వ్య‌వ‌స్థ ఉండేది. మొద‌టి వ‌ల‌యాన్ని దాటుకుని లోప‌లికి ప్ర‌వేశించారు ఉగ్ర‌వాదులు. కానీ మరో రెండు వలయాల ప్రతిస్పందన వేగం ఉగ్రవాదులను భవనంలోకి ప్రవేశించకుండా నిరోధించింది. ఈ క్రమంలో దుండగులు మారణహోమానికి , ఆత్మహుతికి పాల్పడ్డారు.

ఆనాటి ఉగ్రదాడి సమయంలో ఉగ్రవాదులు అప్పటి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కార్యాలయానికి వెళ్లే మూడు మెట్లకు ఒక మీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నారని పలు వార్త కథనాలు పేర్కొంటున్నాయి. అప్రమతమైన వారు వెంటనే తలుపులు మూసివేయడంతో భవనంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆ రోజు ఉగ్రవాదులు తెల్లటి అంబాసిడర్ కారులో రెడ్ లైట్ వెలుగుతూ పార్లమెంట్ స్ట్రీట్ వైపు నుంచి ఉగ్రవాదులు పార్లమెంట్ హౌస్ ఆవరణలోకి ప్రవేశించారు. వారి కారుపై పార్లమెంట్ యాక్సెస్ స్టిక్కర్ ఉండటంతో నేరుగా ప్రధాన ద్వారం దాటి విజయ్ చౌక్ వైపు వెళ్లింది. అనంతరం 11వ గేటు వద్ద ఉపరాష్ట్రపతి కాన్వాయ్ కు చెందిన కార్ల గుంపు వారిని అడ్డగించింది. దీంతో వారి కారు ఆగిపోయింది. అప్పటికే అప్రమత్తమైన ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ గార్డులు ఆ కారుపై దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో యాదవ్ హతమైనప్పటికీ ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా హతమయ్యాడు. అదే సమయంలో ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటమాలి దేశ్ రాజ్ కూడా హత్యకు గురయ్యాడు. దీంతో నలుగురు ఉగ్రవాదులు 11వ గేటు దాటి పరార్ అయ్యారు.   

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రాక కోసం భద్రతా సిబ్బంది సిద్ధమవుతున్న 5వ గేటు వద్దకు వారు పరుగులు తీశారు.అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పార్లమెంటు భవనం తలుపులు మూసివేశారు. ఉగ్రవాదులు గోడ దూకి పారిపోతుండగా సీఆర్పీఎఫ్ సిబ్బంది కాల్పులు జ‌రిపారు. 8, 9 గేట్ల వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, నాలుగో ఉగ్రవాది అక్కడి నుంచి పరార్ కావాలని ప్రయత్నించారు. ఆ దుండగుడు దూరదర్శన్ కేబుల్ ద్వారా మొదటి అంతస్తులోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. కేబుల్ పై నుంచి కిందపడిపోయినప్పటికీ 5వ గేటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రెనేడ్లు విసరడంతో బుల్లెట్ల వర్షం కురిసింది. ప్రధాన ద్వారం వద్ద నష్టం కలిగించే ప్రయత్నంలో ఐదో ఉగ్రవాది గేట్ 1 వైపు పరుగెత్తాడు. తన కలష్నికోవ్ నుంచి కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసురుతూ పాక్ అనుకూల నినాదాలు చేశాడు. ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ప్రధాన మెట్లపైకి దూకాడు. పార్లమెంటు భవనంలోకి చొరబడి అల్లర్లు సృష్టించడం, ఒకరిద్దరిని బందీలుగా పట్టుకోవడం ఉగ్రవాదుల ప్లాన్. 

కానీ వారి ప్లాన్ ను మ‌న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్రమత్తం కావడంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌నే చెప్పాలి. కానీ, అప్ప‌టికే జ‌ర‌గాల్సి దారుణం జ‌రిగిపోయింది. ఈ ఉగ్రదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌వాదుల ప్రణాళిక అనేక కారణాల వల్ల విఫలమైంది.. సరిగ్గా 22 ఏళ్ల తరువాత భారత ప్రజాస్వామ్య గుండెకాయ‌గా భావించే..పార్ల‌మెంట్ పై దాడి జ‌రగడంతో  పార్ల‌మెంట్ వ‌ద్ద భ‌ద్ర‌త ఎలా ఉంద‌నేదానిపై అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios