దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 5 నెలల నుంచి రాజకీయ పరమైన సభలు, సమావేశాలు సైతం బంద్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 5 నెలల నుంచి రాజకీయ పరమైన సభలు, సమావేశాలు సైతం బంద్ అయ్యాయి. ఈ క్రమంలో చట్టసభల నిర్వహణ కత్తిమీద సాములా మారింది.
తాజాగా పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి రాజ్యసభ సచివాలయంలో ఏర్పాట్లు చేపట్టారు. రాజ్యసభ సభ్యుల కోసం సీటింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించిన పనులన్నీ ఆగస్ట్ మూడో వారం కల్లా పూర్తి చేయాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
Also Read:భారత్ లో 25లక్షలు దాటిన కేసులు.. 50వేలకు చేరువలో మరణాలు
అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా అల్ట్రా వైలట్ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం వున్నట్లుగా సమాచారం.
ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రతిరోజూ నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం వుంది.
అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలు జరగాలి. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో సమావేశాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.
