Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో 25లక్షలు దాటిన కేసులు.. 50వేలకు చేరువలో మరణాలు

కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 18.08 లక్షలుగా ఉంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Coronavirus Updates: COVID-19 Cases In India Cross 25 Lakh-Mark
Author
Hyderabad, First Published Aug 15, 2020, 12:52 PM IST

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 65,002 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 996 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,193కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో క్టివ్ కేసులు 6.68 లక్షలుగా ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 18.08 లక్షలుగా ఉంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

అయితే అదే విధంగా కరోనా వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 996 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 49,036 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 57,381 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,08,936 కి చేరింది. అయితే ప్రస్తుతం దేశం లో 6,68,220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios