New Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. వర్షాకాల సమావేశాల్లో శాసనసభా వ్యవహారాలు, ఇతర అంశాలపై ఫలవంతమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నామ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

Parliament Monsoon Session: జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 10న ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం జూలై 19న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. దాపు నెల రోజుల పాటు సాగే వర్షాకాల సెషన్‌లో 20 సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ స‌మావేశాలు స్వాతంత్య్ర‌ దినోత్సవానికి ముందు ముగుస్తాయి. వర్షాకాల సమావేశాల్లో శాసనసభా వ్యవహారాలు, ఇతర అంశాలపై ఫలవంతమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నామ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. "సెషన్‌లో పార్లమెంటు శాసనసభ, ఇతర వ్యవహారాలకు నిర్మాణాత్మకంగా సహకరించాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని కేంద్ర మంత్రి చెప్పారు.

Scroll to load tweet…

పాత భవనంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి సోమవారం తెలిపారు. ప్రతిపక్షాలు కూడా అనేక సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం కల్పించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని తిప్పికొట్టిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లును తీసుకురావడానికి అవకాశం ఉన్నందున సెషన్ వాడివేడిగా సాగే అవ‌కాశ‌ముంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎగువసభలో చట్టాన్ని అడ్డుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల మద్దతును కోరుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతను ప్రదర్శించడానికి ఈ విషయం మరొక ఉదాహరణగా నిలిచే అవ‌కాశ‌ముంది.

Scroll to load tweet…

మేలో, ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పులో, పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూమితో పాటు సేవలపై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) కట్టుబడి ఉండాల‌నే విష‌యాల‌ను ప్ర‌స్తావించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కూడా ఆమోదం తెలిపిందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటాను సేకరించడం, నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం గురించి ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్‌లు, వ్యాపార సంస్థలు వంటి సంస్థలను మరింత జవాబుదారీగా ఉండేలా చేయ‌డం ఈ బిల్లు లక్ష్యం. డీపీడీపీ బిల్లు ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపింద‌నీ, వచ్చే సమావేశాల్లో దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (సవరణ) స‌హా మ‌రికొన్ని కీల‌క బిల్లులు రాబోయే సెషన్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్, 2008 స్థానంలో ఉంటుంది. 2027-28 వరకు పరిశోధనల కోసం ప్రభుత్వం రూ.50,000 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.14,000 కోట్లను నేరుగా అందుబాటులో ఉంచగా, మిగిలిన రూ.36,000 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, ఫౌండేషన్‌లు, అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి సేకరిస్తారు.