పార్లమెంట్ లో రసాభాస ... బిజెపి ఎంపీకి గాయాలు, ఇది రాహుల్ గాంధి పనేనా? 

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నేడు లోక్ సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలో తోపులాట జరిగి ఓ బిజెపి ఎంపీ గాయపడ్డారు. 

Parliament Chaos: BJP MP Claims Injury Caused by Rahul Gandhi AKP

నేడు(గురువారం) భారత పార్లమెంట్ లో రసాభాస కొనసాగింది.  రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది మీరంటే మీరు అంటూ అధికార ఎన్డిఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్ లోనే ఆందోళనకు దిగాయి. ఇలా పోటాపోటీ నిరసనల్లో బిజెపి ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డాయి. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వల్లే తాను గాయపడినట్లు ఎంపీ చెబుతున్నారు. 

మహనీయుడు డా. బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు సభలో అవమానించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వెంటనే వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ  పార్లమెంట్ లోనే ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. అధికార పార్టీ ఎంపీలో పార్లమెంట్  లోకి వస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీల మద్య తోపులాట జరిగింది. 

అయితే ఈ తోపులాటలో బిజెపి ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పతాప్ చంద్ర సారంగి కిందపడిపోయారు. ఆయన తరకు గాయమై రక్తస్రావం అవుతుండటంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయితే తాను గాయపడటానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కారణమని బిజెపి ఎంపీ ఆరోపిస్తన్నారు. 

తాను పార్లమెంట్ లోకి వెళుతుండగా రాహుల్ గాంధీ తన ముందున్న ఎంపీని తోసేసారు... ఆయన వచ్చి తనపై పడ్డాడని సారంగి తెలిపారు. ఈ సమయంలో తాను మెట్లపై వున్నానని... కిందపడటంతో తలకు గాయమైందని తెలిపారు. రాహుల్ గాంధీ ఎంపీని తోసేయడం వల్లే ఇదంతా జరిగిందని బిజెపి ఎంపీ సారంగి తెలిపారు.

అయితే పార్లమెంట్ లో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్ వాదన మరోలా వుంది. బిజెపి ఎంపీలే తనను అడ్డుకుని తోసేయడం, బెదిరించడం చేసారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మహిళా ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు ఎంపీలను కూడా నెట్టేసారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

ఇలా డా.బిఆర్ అంబేద్కర్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసారు స్పీకర్ ఓం బిర్లా. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios