Asianet News TeluguAsianet News Telugu

Parliament Attack 2023 : నా కొడుకు తప్పు చేస్తే ఉరితీయండి.. నిందితుడి తండ్రి

బుధవారం లోక్‌సభలోకి చొరబడ్డ ఆగంతకులెవరో తెలిసింది. దీనిమీద నిందితుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేస్తే శిక్షించాల్సిందే అంటున్నాయి. 

Parliament Attack 2023 : If my son commits a crime, hang him.. Accused's father devraj - bsb
Author
First Published Dec 14, 2023, 6:48 AM IST

ఢిల్లీ : బుధవారం మధ్యాహ్నం  పార్లమెంటులో భద్రతా వైఫల్యం  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు జీరో అవర్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాలరీ గోడదూకి లోక్సభ సభ్యులు ఉన్న ప్రాంతంలోకి దూసుకు వచ్చారు. అక్కడి బెంచీల మీద నుంచి దూకుతూ, రంగురంగుల పొగని వదులుతూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత అప్రమత్తమైన భద్రత సిబ్బంది వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని  మనో రంజన్ గా గుర్తించారు. మరో వ్యక్తిని సాగర్ శర్మగా గుర్తించారు. వీరికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని వారు పార్లమెంటు బయట ఉన్నారు. పార్లమెంటులో ఈ ఇద్దరు చేసిన నినాదాన్ని వారు కూడా బయట చేస్తూ నిరసన తెలిపారు.

ఘటనలో వీరిద్దరూ పట్టు పడడంతో బయట ఉన్న ఇద్దరు పరారయ్యారు. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి  దేవరాజ్ ఈ ఘటన మీద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే అని అతను అంగీకరించారు.  సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించినట్లయితే,  తప్పు చేసినట్లయితే తన కొడుకును ‘ ఉరి తీయాలి’ అని చెప్పారు.  నా కొడుకు తప్పు చేస్తే ఖండిస్తాను. మంచి పని చేస్తే ప్రోత్సహిస్తాను అని మనోరంజన్ తండ్రి చెప్పుకొచ్చారు.

Parliament Security Breach: లోక్‌సభ లో గ్యాస్ దాడి వీళ్ల పనే..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇలాగే పార్లమెంటుపై దాడి జరిగింది.  2001, డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటు మీద ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులతో సహా 15 మంది మరణించారు.  ఈ దాడిలో వీరమరణం పొందిన వారికి పార్లమెంట్..  ఈ ఘటనకు ముందే నివాళులు అర్పించింది.  అంతలోనే ఈ ఘటన జరగడంతో తీవ్రభయాందోళనలకు గురయ్యారు.  మీరు రావడం చూసిన ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు.

ఇదిలా ఉండగా, బుధవారం మధ్యాహ్నం 1గం. ప్రాంతంలో లోక్ సభలో సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు ఆగంతకులు సభలోకి దూకారు. లోక్ సభ్ గ్యాలరీనుంచి బెంచీల మీదుగా దూకుతూ సభలోకి ప్రవేశించారు. వెంటనే గాల్లోకి టియర్ గ్యాస్ వదిలారు. వారిని గమనించిన ఎంపీలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన లోక్ సభ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

గ్యాలరీలోనుంచి లోక్ సభలోకి దూకిన వీరిని చూసి ఎంపీలు భయంతో పరుగులు పెట్టారు. దుండగులు సభలోకి దూరి టియర్ గ్యాస్ వదిలిన ఫొటో ఒకటి వెలుగు చూసింది. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా సమాచారం. నిందితులు పది అడుగుల ఎత్తైన గోడమీదినుంచి దూకి మరి సభలోకి ప్రవేశించారు. వీరిలో ఒకరి పేరు ప్రసాద్ గా గుర్తించారు. మహిళ పేరు నీలంగా గుర్తించారు. ఆగంతకులు షూలో టియర్ గ్యాస్ అమర్చుకుని విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఉండే పార్లమెంటులోకి వీరిద్దరు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ సమయంలో అసెంబ్లీలో జీరో అవర్ జరుగుతుంది. ఘటన నేపథ్యంలో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. విజిటర్స్ గ్యాలరీలోకి రావాలన్నా కూడా ఎంపీ రికమండేషన్, లేదా పార్లమెంట్ అధికారుల అనుమతి ఉండాలి. మరి వీరిద్దరికి ఎవరు అనుమతి ఇచ్చారో అనే కోణంలో భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఆగంతకులు పార్లమెంటులోకి ప్రవేశించిన సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలు సభలో లేరు. రాహుల్ గాంధీతో సహా మిగతా నేతలందరూ ఉన్నారు. 

ఈ ఘటనపై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'ఇద్దరు యువకులు గ్యాలరీ నుంచి దూకారు. టియర్ గ్యాస్‌ వెదజల్లుతూ ఏదో వస్తువు విసిరారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు, భద్రతా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 2001 (పార్లమెంటు దాడి)లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తుల వర్ధంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ సమయంలో ఈ ఘటన ఖచ్చితంగా భద్రతా ఉల్లంఘనే..." అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios