పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలను జీవితంలో ఒక భాగంగా మాత్రమే చూడాలని... వాటినే జీవితంగా భావించవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా మారిపోయిందని... చాలా అవకాశాలు మన ముందు ఉన్నాయన్న విషయం గుర్తించుకోవాలని చెప్పారు.

సాంకేతికతను గుప్పెట్లో పెట్టుకోవాలని.. దాని గుప్పెట్లోకి మనం వెళ్లకూడదని సూచించారు.  2001లో కోల్ కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ ఆడిన ఆట తీరును కూడా మోదీ ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించడం గమనార్హం.  ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాకకు చెందిన జావేద్ పవార్ తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన 22మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.

రెండువేల మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కాగా.. రాత్రంతా మెల్కొని చదవడం కంటే.. ఉదయాన్నే లేచి చదువుకోవడం ఉపయోగకరమని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు.

Also Read యువతిపై దూసుకెళ్లిన కారు.. స్నేహితులే అత్యాచారం చేసి...

ప్రస్తుతం ప్రపంచం మారిపోయిందని అవకాశాలు బాగా పెరిగిపోయాయని చెప్పారు. పరీక్షల్లో వచ్చే మార్పలు మాత్రమే ప్రపంచం కాదని చెప్పారు.తాము చెప్పింది కాకపోతే ఇంకేమీ కాలేరన్న బావనను తల్లిదండ్రులు పిల్లల్లో కల్పించవద్దని చెప్పారు. అనుకున్నది సాధించకపోతే ప్రపంచం మునిగిపోయిందని బాధపడొద్దని అన్నారు.

చదవుతోపాటు ఎక్స్ ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమని సూచించారు. చదువుకే పరిమితమై అభిరుచికి తగిన కార్యకలాపాలను చేయకపోతే రోబోల్లా తయారౌతారని చెప్పారు. చదువుకు, ఇతర కార్యకలాపాలకు మధ్య సమయాన్ని సంతులనం చేసుకోవాలని సూచించారు.