పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుందని.. ఉన్న బిడ్డను చంపి పూడ్చిపెట్టారు

Parents kill bury daughter in home at Moradabad
Highlights

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతగా పురోగమిస్తున్నా.. నేటికి మూఢనమ్మకాలను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మొన్నటికి మొన్న మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడితే.. మరణానంతరం స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని.. మోక్షం సంప్రప్తిస్తుందని నమ్మిన ఢిల్లీలోని 11 సభ్యుల కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతగా పురోగమిస్తున్నా.. నేటికి మూఢనమ్మకాలను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మొన్నటికి మొన్న మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడితే.. మరణానంతరం స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని.. మోక్షం సంప్రప్తిస్తుందని నమ్మిన ఢిల్లీలోని 11 సభ్యుల కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని ఓ జంట పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టాలని ఉన్న బిడ్డను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు.

చౌదర్‌పూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దంపతులకు తారా అనే అమ్మాయి ఉంది.. ఈ పాపకు పుడుతూనే ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉంది.. ఎన్ని మందులు వాడినప్పటికీ బిడ్డకు నయం కాలేదు సరికదా.. రోజు రోజుకి చిన్నారి బలహీనంగా తయారైంది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు పాపకు నయం చేయాలని ఒక తాంత్రికుడిని కలిశారు.

అతను ఈ పాపను చంపి.. ఇంట్లో పూడ్చిపెట్టాలని..  మీకు తర్వాత పుట్టబోయే బిడ్డ అందంగా, పూర్తి ఆరోగ్యకరంగా పుడుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన దంపతులు తారను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. రోజు కనిపించే పాప శబ్ధం కానీ... నవ్వులు కానీ వినిపించకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి వెనుక భాగంలో పాపను పూడ్చిపెట్టిన ప్రాంతంలో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదికలో చిన్నారికి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నీరు, ఆహారం ఇవ్వలేదని.. అంతేకాకుండా పాప ఊపిరి ఆడని స్థితిలో మరణించిందని తేలింది. విషయం బయటకు పోక్కడంతో తార తల్లిదండ్రులు పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

loader