కూతురు తరచూ ఫోన్ లో మాట్లాడుతుందని తెలిసిన తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. ఫోన్ లో అతడితో మాట్లాడకూడదని బెదిరించారు. అయినా ప్రతిభ వినకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. కూతురు వల్ల తమ పరువు పోతుందని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ భయంతోనే ఈ నెల 22న కమల, నరేంద్ర కలిసి ప్రతిభ గొంతుకోసి హత్య చేశారు. ఆమె ముఖం, మెడపై దాడి చేయడం వల్ల ఎముకలు విరిగి ఆ యువతి మృతి చెందింది.
లక్నో : ఆ యువతి వయస్సు 19 యేళ్లు. ఓ రోజు పొలంలో స్థానికులకు dead bodyగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అది చూసిన తల్లిదండ్రులు తమ కూతురిని rape attempt చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని Postmortemకోసం తరలించారు. యువతిపై అత్యాచారం జరగలేదని రిపోర్టులో స్పష్టమైంది. అయితే Technologyతో పోలీసులు అసలు కథ ఏంటో తేల్చేశారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హర్దోయ్ ప్రాంతానికి చెందిన కమల, నరేంద్ర దంపతుల కూతురు ప్రతిభ (19). ఆమె స్థానిక కాలేజీలో చదువుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. ఫోన్ లో అతడితో మాట్లాడకూడదని బెదిరించారు. అయినా ప్రతిభ వినకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. కూతురు వల్ల తమ పరువు పోతుందని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ భయంతోనే ఈ నెల 22న కమల, నరేంద్ర కలిసి ప్రతిభ గొంతుకోసి హత్య చేశారు. ఆమె ముఖం, మెడపై దాడి చేయడం వల్ల ఎముకలు విరిగి ఆ యువతి మృతి చెందింది.
హత్య తర్వాత కమల తనతో సన్నిహితంగా ఉండే విపిన్, రామ్ నరేష్ ను పిలిపించుకుంది. వారి సహాయంతో కూతురు మృతదేహాన్ని పొలంలో పడేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిభను హత్య చేసిన తల్లిదండ్రులు ఏమీ ఎరగనట్టు.. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు లో యువతిపై అత్యాచారం జరగలేదని స్పష్టమయింది.
అయితే ఘటనా స్థలంలో దొరికిన కీప్యాడ్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా విపిన్ ను గుర్తించారు. అతడిని విచారించగా జరిగిందంతా చెప్పాడు వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
భార్య, భర్త.. మధ్యలో ఆమె... అడ్డుతొలగించుకోవాలని.. అర్థరాత్రి దారుణం..
ఇదిలా ఉండగా, తమిళనాడు తీరప్రాంత నగరం మంగళూరులో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల నుంచి ఒక యువతికి drugs ఇచ్చి
Sexual assaultకి పాల్పడుతున్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్ కు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కూతురిని ఇలా నాశనం చేశారని మీడియా ముందు విలపించింది. కూతురు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ఆమెను కాపాడాలని విహెచ్పి నాయకులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి సురత్కల్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ (47) అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అతనికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
