2014లో బయలుదేరి... నిన్న గమ్యానికి చేరిన రైలు

parcel reaches destination after 3 years from Visakhapatnam
Highlights

 ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని మన భారతీయ రైల్వే గురించి వినిపించే సామెత. అనుకున్న సమయానికి రాక... వెళ్లాల్సిన టైంకి గమ్యానికి చేరక రైల్వేలు అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాయి. తాజాగా ది గ్రేట్ ఇండియన్ రైల్వేల అంతులేని నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ.. 2014లో బయలుదేరిన గూడ్స్ రైలు నిన్న గమ్యానికి చేరింది.

ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని మన భారతీయ రైల్వే గురించి వినిపించే సామెత. అనుకున్న సమయానికి రాక... వెళ్లాల్సిన టైంకి గమ్యానికి చేరక రైల్వేలు అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాయి. తాజాగా ది గ్రేట్ ఇండియన్ రైల్వేల అంతులేని నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ.. 2014లో బయలుదేరిన గూడ్స్ రైలు నిన్న గమ్యానికి చేరింది..

2014లో విశాఖపట్నానికి చెందిన ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అనే కంపెనీ వ్యాగన్ నెంబర్ (107462)లో రూ.10 లక్షలు విలువ చేసే ఎరువులను విశాఖపట్నం పోర్ట్ నుంచి ఢిల్లీలోని రామచంద్ర గుప్తా అనే వ్యక్తికి పార్శిల్ చేసింది.. ఎన్ని నెలల గడిచినా ఎరువుల పార్శిల్ రాకపోవడంతో సదరు యజమాని భారతీయ రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ ఆ వ్యాగన్ ఎక్కడుందో అధికారులు కనిపెట్టలేకపోయారు.

అలా మూడున్నర సంవత్సరాల పాటు సదరు వ్యాగన్ దేశం మొత్తం తిరిగి తిరిగి చివరికి ఢిల్లీకి చేరింది. సరకు గురించి యజమానికి తెలపగా.. వచ్చి చూసిన ఆయన నిర్ఘాంతపోయారు... ఏళ్లు గడవటంతో ఎరువులు మొత్తం పాడైపోయాయి.  దీంతో సరకు తీసుకోవడానికి యజమాని తిరస్కరించాడు.. వేగన్‌ను గుర్తించకపోవడం రైల్వే అధికారుల నిర్లక్ష్యమని.. ఎన్ని సార్లు లేఖలు రాసినా ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారని యజమాని ఆరోపించాడు. తనకు జరిగిన నష్టాన్ని రైల్వేశాఖే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. 

loader