Pani puri: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా సుగంధ గ్రామంలోని డొగచియ ప్రాంతంలోని ఓ దుకాణంలో పానీపూరి తిని వంద మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు. పలువురు అనారోగ్యానికి లోనయ్యారు. వారిలో డయేరియా లక్షణాలు కనిపించాయి.
Pani puri: పానీపూరి పేరు చెప్పగానే నోట్లో వెంటనే నీళ్లు ఊరుతాయి. పానీపూరి చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. వీధుల్లో ఎక్కడ కనిబడితే.. అక్కడ దొరికే పానీపూరి కోసం చాలా మంది ఎగబడుతుంటారు. ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ పానీపూరి తింటూ ఈ లోకాన్నే మైమరిపోతుంటారు. అయితే.. అదే పానీపూరి తిని వందమందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధిలో ఓ వీధి బండి వద్ద పానీపూరి తిన్న అందరూ సాయంత్రానికి కల్లా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. తీవ్ర అనార్యోగంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ.. ప్రత్యేక వైద్య బృందాలను రోగులకు మందులు అందించారు. కలుషిత ఆహారానికి సంబంధించిన శాంపిల్స్ ను సేకరించారు. పానీపూరి తిని అస్వస్ధతకు గురైన వారిలో డొగచియ, బహిర్ రణగచ, మకల్‌తల ప్రాంతాలకు చెందిన వారున్నారని అధికారులు గుర్తించారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియా అని వైద్యులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు.
గత రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మండలా జిల్లాలో పానీపూరి తిని 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్న కాసేపటికే పిల్లలు వాంతులు, విరేచనాలతో కడుపునొప్పితో బాధపడ్డారు. దాంతో బాధితులను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స చేశారు.
