Asianet News TeluguAsianet News Telugu

ముంబ‌యి-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నలుగురు మృతి

Palghar: ముంబ‌యి-అహ్మదాబాద్ హైవేపై మహాలక్ష్మి బ్రిడ్జి సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో  జరిగిన ఈ ప్రమాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోగా, లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయని కాసా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
 

Palghar : Fatal road accident on Mumbai-Ahmedabad highway;Four killed
Author
First Published Jan 31, 2023, 7:33 PM IST

road accident on Mumbai-Ahmedabad highway: మ‌హారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. అతివేగంగా వ‌స్తున్న ఒక కారు బ‌స్సును ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ముంబ‌యి-అహ్మదాబాద్ హైవేపై మహాలక్ష్మి బ్రిడ్జి సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో  జరిగిన ఈ ప్రమాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోగా, లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయని కాసా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి స్థానికులు, పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబ‌యి-అహ్మదాబాద్ హైవేపై మంగళవారం నాడు కారు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. హైవేపై మహాలక్ష్మి వంతెన సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని కాసా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

కారులో ప్రయాణిస్తున్న నలుగురు గుజరాత్ నుంచి పాల్ఘర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబ‌యికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతులు సూరత్‌లోని బార్డోలి వాసులు. తెల్లవారుజామున బస్సును వెనుక నుంచి కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.

హ‌ర్యానాలోని మ‌రో రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి

హ‌ర్యానాలో వేగంగా వ‌చ్చిన ఒక కారు అక్కడున్న వారికి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. బహదూర్‌ఘర్‌లోని దేవి లాల్ పార్క్ సమీపంలో సోమ‌వారం సాయంత్రం కారు ఢీకొనడంతో ఇద్దరు విక్రేతలు, సైక్లిస్ట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన రామ్ మహేష్, సోమనాథ్, బహదూర్‌ఘర్‌కు చెందిన సైక్లిస్ట్ రామ్ చందర్‌గా గుర్తించారు. గాయపడిన యూపీకి చెందిన రాజేష్‌ను పీజీఐఎంఎస్ రోహ్‌తక్‌లో చేర్చారు. గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

తెలంగాణ‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 30 మందికి గాయాలు.. 

బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 30 మందికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్ర‌యివేటు పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ప్ర‌యివేటు ఆసుపత్రికి, బస్సు ప్రయాణికులను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాఠశాల బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.

ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆస్పత్రికి పరుగులు తీశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios