ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు.
ముంబై: మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా బాయిసర్ లోని ఓ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది ఈ పేలుడులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల కిటికీలు కూడా దెబ్బతిన్నాయి.
ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొత్త కొత్త రియాక్టర్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ పైటర్లు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 5లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు సహాయక చర్యలు ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు