పాకిస్తాన్ మరోసారి తన దొంగ బుద్ధిని బయటపెట్టింది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లా షహపూర్, కెర్నీ సెక్టార్లలో గురువారం రాత్రి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భారత సైనికులు పాక్ సైనికుల కాల్పులను తిప్పి కొట్టారు.

భారత సైనికుల ప్రతి కాల్పులతో పాక్ సైనికులు పారిపోయారు. పుల్వామా దాడి, బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది.  తరచూ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతుంది. కాగా తాజాగా జరిపిన ఈ కాల్పుల్లో మాత్రం ఎవరూ గాయపడలేదు. ఇప్పటికే కశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించింది. ఈ విషయంలో భారత్ ది తప్పు అని నిరూపించడానికి పాక్ చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది. ఆ కారణంతో కూడా పాక్ ఈ విధంగా కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.