Pak PM Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక అమెరికా ఉందని చెప్పారు. ఈ పరిస్థితికి అమెరికానే కారణమని ఆరోపించారు.
Pak PM Imran Khan: మరోసారి అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అమెరికా ను పరోక్షంగా విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇమ్రాన్‌ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడారు.
దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజలను కోరారు. విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి కావాలని కోరుకుంటున్నందున, అవినీతి కేసుల నుంచి బయటపడి సొమ్ము చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు తమతో చేతులు కలిపినాయని ఆరోపించారు.
యుఎస్ దౌత్యవేత్తలు పాక్ నేతలను కలుస్తున్నారని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్దనున్నాయని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా సమస్యల కారణంగా అన్ని వివరాలను బహిరంగంగా విడుదల చేసే స్వేచ్ఛ తనకు లేదని ఆయన అన్నారు. పాక్ రాజకీయ నాయకులను గొర్రెల మాదిరిగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని, ప్రతిపక్షాలు ఈ పరిస్థితిని గుర్రపు రేసులా భావిస్తున్నాయని మండిపడ్డారు. తన ప్రభుత్వ పతనం జరుగుతోందని సంబురాలు చేసుకుంటోందని ఆరోపించారు. అలాగే..దేశంలోని మీడియాపై కూడా ఆయన మండిపడ్డారు.
అలాగే భారత్‌పై ఇమ్రాన్‌ఖాన్ మరోమారు ప్రశంసించారు. భారత్ సార్వభౌమాధికార దేశం కాబట్టి ఏ అగ్రరాజ్యం దానికి నిబంధనలను నిర్దేశించదనీ, భారత్‌తో అలా మాట్లాడే ధైర్యం వారిలో ఎవరికీ లేదన్నారు. భారత దేశ విదేశంగ విధానం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. విదేశీ శక్తులు మెలిగే ప్రధానిని కోరుకుంటున్నాయని, అందుకే ఆయనను బయటకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పీఎం ఖాన్ అన్నారు. రాజకీయ పరిస్థితులను పాకిస్థాన్ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించారు. మేం 22 కోట్ల మంది ఉన్నామని.. బయటి నుంచి ఎవరో 22 కోట్ల మందికి ఆర్డర్ ఇవ్వడం అవమానకరమని ఆయన అన్నారు.
తాను ఓ పప్పెట్‌లా ఉండాలని అమెరికా భావించిందని, తనను తోలుబొమ్మను చేసి ఆడించాలనుకుందని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. రష్యాలో తాను పర్యటించడం అమెరికాకు నచ్చలేదన్నారు. తన రష్యా పర్యటన అమెరికాకు ఇష్టం లేదని ఆరోపించారు. తనను పదవీచ్యుతుడ్ని చేయాలని కోరుతూ పార్లమెంటరీ ఓటింగ్‌ను అడ్డుకునేందుకు పీఎం ఖాన్ తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఇకపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం శనివారం ఉదయం 10 గంటలకు జరగనుంది.
తాను సుప్రీం కోర్ట్, న్యాయవ్యవస్థను గౌరవిస్తాననీ, కానీ తీర్పును వెలువరించే ముందు అది బెదిరింపు లేఖను చూడవలసిందని, తీర్పు పట్ల బాధపడ్డానని చెప్పాడు. మిస్టర్ ఖాన్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు, డిప్యూటీ స్పీకర్ అవిశ్వాసాన్ని అడ్డుకున్నారు. ప్రధానమంత్రి విధేయుడిగా భావించిన ఆయన మరియు రాష్ట్రపతికి వ్యతిరేకంగా మోషన్ పార్లమెంటును రద్దు చేసి, తాజా ఎన్నికలకు ఆదేశించింది.
