Asaduddin Owaisi: వార‌ణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో చేప‌ట్టిన వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి కోర్ట్‌ ఆఫ్‌ సివిల్ ను ఆశ్ర‌యించ‌డం. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర అభ్యంతరం  వ్యక్తం చేశారు. ఇది 1991 చట్టాన్ని ఉల్లంఘించడమేనని,  జ్ఞానవాపి మసీదుకు బాబ్రీ పరిస్థితి రానీయబోనని ఒవైసీ ఆందోళన వ్య క్తం చేశారు.  

Asaduddin Owaisi: వార‌ణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే( Gyanvapi masjid survey) సోమవారం ముగిసింది. అయితే.. ఈ సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని, ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ హిందూ పిటిషనర్లు వారణాసి కోర్ట్‌ ఆఫ్‌ సివిల్ ను ఆశ్ర‌యించారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. అందులోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వాన్ని కోరింది. ఇదిలా ఉంటే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మ‌సీద్ కమిటీ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేప‌ట్ట‌నున్న‌ది సుప్రీంకోర్టు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఈ నిర్ణయంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది 1991 చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఒవైసీ అన్నారు. కోర్టు తీర్పును ముస్లింల సంస్థపై దాడిగా ఆయ‌న‌ అభివర్ణించారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కిందికోర్టు తీర్పునిచ్చిందన్నారు. కానీ కింది కోర్టుకు ఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లే హక్కు లేదు.

1991 చట్టం ఉల్లంఘన

స్వాతంత్రానికి పూర్వం(1947 ఆగస్టు 15 ముందు) ఉన్న ఏ మతస్థలం స్వభావాన్ని మార్చలేమని 1991 చట్టం చెబుతోందని ఒవైసీ అన్నారు. కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు 1991 చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, సర్వే కమిషనర్ కోర్టుకు నివేదించరని అన్నారు. ఈ కేసులో ముస్లింల మాట వినకుండా తీర్పు వెలువరించిందని ఆరోపించారు. ఈ విష‌యంలో మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో విచారణ ఉందని, కిందికోర్టు ఇంత తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు కేసులో ఏం జరిగిందో చూశామని ఒవైసీ అన్నారు. మరో మసీదును పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

వాస్తవానికి జ్ఞాన్‌వాపి మసీదు కేసులో వారణాసి కోర్టు మే 17లోగా మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత హిందూ తరపు న్యాయవాది విష్ణు జైన్ మాట్లాడుతూ.. శివలింగం బావిలో కనిపించాడని, ఎవరి రక్షణ కోసం అతను సివిల్ కోర్టుకు వెళ్తాడు. అదే సమయంలో, బావిలోని నీటిని తొలగించిన వెంటనే, ఎదురుగా ఒక భారీ శివలింగం కనిపించిందని హిందూ తరపు మరో న్యాయవాది వాదించారని విమ‌ర్శించారు. 

వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు బాబ్రీ పరిస్థితి రానీయబోనని ఒవైసీ అన్నారు. చట్టా న్ని ఉల్లంఘించి జ్ఞానవాపి మసీదులో సర్వే జరుపుతున్నారని.. ఇది తనను బాధిస్తోందని ఆందోళన వ్య క్తం చేశారు. తాను అంతరాత్మను అమ్ముకోలేదనీ. అందుకే జ్ఞానవాపి మసీదుపై మాట్లాడుతునే ఉంటాన‌నీ. అల్లాకు తప్ప.. మోదీకో, యోగీకో అస‌లు భయపడనని, బీఆర్ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందనీ, అందుకే ఈ సమస్యపై మాట్లాడుతునే ఉంటాన‌ని స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్టు తనను విమర్శిస్తున్నారన్నారు. 

తనను ప్రశ్నించే వారు ప్రార్థనా మందిరాల చట్టం-1991లోని సెక్షన్‌ 4(2)ను చదువుకోవాలని, ఆ చ‌ట్టంలోని సెక్షన్‌ ప్రకారం ప్రార్థనా మందిరాల్లో 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న పరిస్థితులను మార్చేలా వ్యాజ్యాలు వేయకూడదని వివ‌రించారు. బీజేపీకి సహ‌కరించ‌డానికే ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తోందన్న విమర్శలను ఒవైసీ తీవ్రంగా ఖండించారు.