Asianet News TeluguAsianet News Telugu

విచిత్రం.. మార్కులు తక్కువొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని యజమాని.. వైరల్...

బెంగళూరులో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. పన్నెండో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని ఓ వ్యక్తికి ఇంటిని అద్దెకివ్వడానికి నిరాకరించాడు యజమాని. 

owner rejected to rent the house because, his marks were low in Class 12th in bengaluru - bsb
Author
First Published Apr 28, 2023, 1:03 PM IST

బెంగళూరు : అద్దె ఇంటి కష్టాలు ఎలా ఉంటాయో.. బ్యాచిలర్లను అడిగితే తెలుస్తుంది. ఇక మెట్రో నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం అంటే గగనమే. ముఖ్యంగా బెంగుళూరు లాంటి ఐటీ హబ్ గా, స్టార్ట్ అప్ లకు రాజధానిగా పేరుపడ్డ మెట్రో నగరాల్లో అద్దెకు ఇల్లు దొరకడం కంటే..  ఐఐటీలో చేరడం సులభమని జోకులు ఉన్నాయి. అద్దె ఇంటి కోసం వచ్చేవారికి.. ఓనర్లు పెట్టే నిబంధనలు చాలా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ నిబంధనలు లాజిక్ కు అందవు.  అలాంటి ఓ విచిత్ర ఘటన  బెంగళూరులో వెలుగు చూసింది.

ఓ వ్యక్తికి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించాడు ఇంటి యజమాని. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా నిజంగా ఇది జరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని సదరు వ్యక్తి సోదరుడు ట్విట్టర్లో షేర్ చేయగా.. ఎవరూ నమ్మలేదు.  అందుకే అద్దె కోసం బ్రోకర్ తో జరిపిన సంభాషణకు సంబంధించిన వాట్స్అప్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. 

శుభ్ అనే  ఓ ట్విట్టర్ యూజర్ చేసిన ఈ పోస్టింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అతను షేర్ చేసిన వాట్సాప్ చాట్ లో.. ఒక బ్రోకర్ తో తన బంధువైన యోగేష్ చేసిన చాటింగ్ వివరాలు ఉన్నాయి. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న క్రమంలో అతను ఓ బ్రోకర్ ను కలిశాడు. ఆ బ్రోకర్ యోగేష్ ఆధార్,పాన్ కార్డ్‌లతో పాటు లింక్డ్‌ఇన్, ట్విట్టర్ ప్రొఫైల్‌లు, అతను ఉద్యోగం చేస్తున్న కంపెనీకి సంబంధించిన జాయినింగ్ లెటర్, 10వ, 12వ తరగతి మార్కు షీట్‌లను షేర్ చేయమని అడిగాడు. 

ముస్లింలు విద్యా విప్లవం తీసుకొచ్చారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశంసలు..

దీంతోపాటు తన గురించి తాను 200 పదాలలో వివరించి రాయమని కూడా అడిగాడు. అతను అడిగిన డీటెయిల్స్ అన్నింటిని యోగేష్ పంపించాడు. ఆ తర్వాత బ్రోకర్ నుంచి వచ్చిన సమాధానం అతన్ని షాక్ కు గురిచేసింది. 12వ తరగతిలో మార్కులు తక్కువగా రావడంతో ఇల్లు ఇవ్వడానికి యజమాని ఒప్పుకోలేదని బ్రోకర్ చెప్పాడు. ఇంటి యాజమానికి 12వ తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయట, యోగేష్ కు 75 శాతం మార్కులు రావడంతో అది అభ్యంతరం వ్యక్తం చేసి…ఇవ్వడానికి నిరాకరించినట్లుగా బ్రోకర్ తెలిపాడు. 

"మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించవు, కానీ మీరు బెంగళూరులో ఫ్లాట్ ఇవ్వాలా వద్దా అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది" అని శుభ్ పోస్ట్‌కు క్యాప్షన్‌గా రాశారు. ఈ ఇంటి యజమాని ఐఐఎంలో ప్రొఫెసర్ గా రిటైర్డ్  అయ్యాడని శుభ్ కామెంట్ చేశాడు. 

మరో వ్యక్తి కామెంట్ చేస్తూ... నా పని గురించి తెలిసిన నా ఓనర్ నాకు కాఫీ ఆఫర్ చేసింది. కానీ మీకు ఎదురైన సంఘటన విచారకరం అని రాశాడు. మరొకరు మాట్లాడుతూ.. ఇది నిజమే. దీంతోపాటు మీరేదైనా ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారని మీ పనిమనిషికి తెలిసిందనుకో.. ఆమె జీతాన్ని అమాంతం నెలకు రూ. 30 వేలకు పెంచేస్తుంది. మీరు ఐటీ ఎంప్లాయ్ కాదని ఆమెను నమ్మించగలిగితే మీ మెయిడ్ జీతాన్నిరూ. 9వేలకు తగ్గిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ఇంకొకరు.. బెంగళూరులో ప్లాట్ అద్దెకు కావాలంటే ఎంట్రెన్స్ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన రోజులొస్తాయని మరొకరు హాస్యం చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios