Asianet News TeluguAsianet News Telugu

ముస్లింలు విద్యా విప్లవం తీసుకొచ్చారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశంసలు..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మైనారిటీ ముస్లిం విద్యార్థులు చార్ ప్రాంతాలలో విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు.  

Assam CM Himanta Biswa Sarma praises Muslims for educational revolution ksm
Author
First Published Apr 28, 2023, 12:03 PM IST

గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మైనారిటీ ముస్లిం విద్యార్థులు చార్ ప్రాంతాలలో విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు.  సాధారణంగా ఈ నదీతీర ప్రాంతాలు వెనుకబడినవిగా పరిగణించబడతాయి. మైనారిటీలలో (ప్రధానంగా ముస్లింలు) విద్యారంగంలో పురోగతి సాధించడం చారిత్రాత్మకమని హిమంత బిస్వా శర్మ అన్నారు. ప్రతి సంవత్సరం మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు మంచి ఫలితాలు కనబరుస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ కోర్సులలో ప్రవేశం పొందుతున్నారని చెప్పారు. 

చాలా కుటుంబాలు, ఎక్కువగా ముస్లింలు చార్ ప్రాంతాల నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్న సమయంలో హిమంత బిస్వా శర్మ ఈ వ్యాఖ్యలు  చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘చార్ ప్రాంతాలలో విద్యాపరమైన మెరుగుదల ఉంది. చార్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మా వైద్య ఫలితాలలో చాలా బాగా రాణిస్తున్నారు’’ అని చెప్పారు. 

‘‘మతపరమైన మైనారిటీ విద్యార్థులు మంచి సంఖ్యలో వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు పొందారు. పోటీని ఎదుర్కొని ప్రవేశం పొందుతున్నారు. గత సంవత్సరం 320 మంది విద్యార్థులు (1,000 సీట్లలో) మెడికల్ స్ట్రీమ్‌లో ప్రవేశించారు. మతపరమైన మైనారిటీ ప్రాంతాలు ఇతరుల కంటే విద్యాపరంగా మెరుగ్గా ఉన్నాయి. మెడికల్ కాలేజీ అడ్మిషన్ గణాంకాలు దీనికి రుజువు’’ అని హిమంత బిస్వా శర్మ అన్నారు. మతపరమైన మైనారిటీ ప్రాంతాల్లో విద్య గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు.. విద్యలో చార్ ఏరియాలు నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని ప్రశంసలు కురిపించారు. 

ఇదిలా ఉంటే.. శిక్షణా కేంద్రంలో ఒక టీచర్ మాట్లాడుతూ.. ‘‘చార్ లేదా మైనారిటీ ప్రాంతాలకు చెందిన విద్యార్థులలో పోటీ మనస్తత్వం పెరుగుతోంది. ఆ విద్యార్థులలో చాలా మంది చాలా పేద కుటుంబాల నుండి వచ్చారు. నీట్ పరీక్ష చాలా కష్టం, సవాలుతో కూడుకున్నది. ఈ ప్రాంతంలోని విద్యార్థులు బాగా చదువుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవడం కంటే జీవించడానికి సరైన మార్గం లేదు. అందుకోసం వాళ్లు కూడా కష్టపడుతున్నారు’’ అని చెప్పారు. 

గత సంవత్సరం నీట్ పరీక్షలో అజ్మల్ ఫౌండేషన్‌లో కోచింగ్ పొందిన 200 మంది అభ్యర్థులు అఖిల భారత వైద్య కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరంతా చార్ ప్రాంతాలకు చెందిన వారే. అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉమ్మడి పోటీ పరీక్షలో కూడా అజ్మల్ ఫౌండేషన్ అభ్యర్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు.

అజ్మల్ ఫౌండేషన్ అజ్మల్ సూపర్ అనే శిక్షణా కేంద్రం ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే వారి కలలను నెరవేర్చడానికి పేద, తెలివైన విద్యార్థులకు కోచింగ్ అందిస్తోంది. ఇక, అజ్మల్ ఫౌండేషన్ 2016లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ సంవత్సరం 240 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

దేశంలో మెడికల్ సైన్స్ కోర్సులు చదవడం కోసం అఖిల భారత స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో ఒకే విద్యా సంస్థ నుంచి చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణులవడం దేశంలోనే అరుదైన దృగ్విషయం. అఖిల భారత స్థాయిలో విజయం సాధించిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థుల్లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారే. ఇక, ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీలు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్, సిరాజుద్దీన్ అజ్మల్ ఆదేశాల మేరకు అజ్మల్ ఫౌండేషన్ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించింది.

అజ్మల్ సూపర్ 40 దాని ప్రారంభం నుంచి అద్భుతమైన ఫలితాలను చూపుతోంది. ఇన్‌స్టిట్యూట్‌లోని 84 మంది విద్యార్థులు 2020 నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 2021 నీట్ పరీక్షలో 150 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం అజ్మల్ సూపర్ 40 ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యను 240+కి పెంచడం ద్వారా అస్సాం విద్యా రంగంలో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios