Asianet News TeluguAsianet News Telugu

ఐదు రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న జ్వరాలు... 100మంది చిన్నారులు మృతి...

భోపాల్, ఇండోర్, జబల్ పూర్,అర్ మాల్వా, రత్లం జిల్లాల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా దాదాపు 1200మంది పిల్లలు జ్వరం, శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉత్తర బెంగాల్ లో జ్వరాలతో ఇద్దరు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

over hundred children deaths in five states madhya pradesh, uttar pradesh badly affected
Author
Hyderabad, First Published Sep 17, 2021, 1:03 PM IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో డెంగీ, వైరల్ జ్వరాల జోరుతో 100మంది పిల్లలు మరణించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వేలాదిమంది పిల్లలకు డెంగీ, వైరల్ జ్వరాలు ప్రబలాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,500 మందికి డెంగీ జ్వరాలు సోకాయి. 

డెంగీ జ్వరాలతో 100 మంది మరనించారు. దీంతో డెంగీ ప్రబలటానికి కారణమైన దోమల నివారణకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జబల్ పూర్ పట్టణంలో ఎయిర్ కూలర్లపై నిషేధం విధించింది. జబల్ పూర్ పట్టణంలో దాదాపు 3000 జ్వరం కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వందలాదిమంది జ్వరాల బారిన పడ్డారు. 

ఉత్తర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో పిల్లల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో వైరల్ జ్వరం వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై. ప్రతాప్ సింగ్ తెలిపారు. 

భోపాల్, ఇండోర్, జబల్ పూర్,అర్ మాల్వా, రత్లం జిల్లాల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా దాదాపు 1200మంది పిల్లలు జ్వరం, శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉత్తర బెంగాల్ లో జ్వరాలతో ఇద్దరు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

బీహార్ రాష్ట్రంలో పిల్లలకు న్యూమోనియా కేసులు పెరిగాయి. పిల్లల ఆసుపత్రులు రోగులతో నిండాయి.  హర్యానాలో వైరల్ ఫీవర్ అనేక మంది చిన్నారులు ప్రాణాలను బలిగొంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం కొందరు  పిల్లలు  న్యూమోనియా,  గ్యాస్ట్రోఎంటెరిటిస్ వల్ల మరణించారు.

హర్యానాలోని పాల్వాల్ జిల్లాలోని చిల్లీ అనే చిన్న గ్రామంలో గత రెండు వారాల్లో ఎనిమిది మందికి పైగా చిన్నారులు వైరల్ జ్వరాలతో మరణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios