Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

 ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐదుగురికి ఇలా పిత్తాశయ సమస్య రావడం గుర్తించామని చెప్పారు. వారికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.
 

Gallbladder gangrene in 5 after Covid sparks alarm
Author
Hyderabad, First Published Sep 17, 2021, 9:31 AM IST


కరోనా మహమ్మారి మనల్ని పట్టిపీడిస్తోంది.  ఈ మహమ్మారి ఎప్పుడు మనల్ని వదిలేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే..ఈ కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మందిలో సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పిత్తాశయ సమస్యలు కూడా వస్తున్నాయని తాజాగా తేలింది. ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. ఐదుగురిలో ఈ పిత్తాశయ సమస్యలు తలెత్తాయని వైద్యులు గుర్తించారు.

 గంగారామ్ హాస్పిటల్  లో ఇప్పటి వరకు ఐదుగురులో పిత్తాశయ సమస్యలు గుర్తించినట్లు వైద్యులు చెప్పారు.  కాగా.. ఆ ఐదుగురికి తాము వైద్యం అందించామని.. వారు కోలుకున్నారని గంగారామ్ హాస్పిటల్ ఛైర్మన్ అనిల్ అరోరా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐదుగురికి ఇలా పిత్తాశయ సమస్య రావడం గుర్తించామని చెప్పారు. వారికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.

కాగా.. పిత్తాశయంలో రాళ్లు రావడం అనేది ఉత్తర భారతంలో  చాలా కామన్ సమస్య అని అయితే.. వీరిలో మాత్రం సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని వారు చెప్పారు. 

ఐదుగురిలో నలుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. వారి వయసు 37 నుంచి 75 వరకు ఉంటుందని చెప్పారు. వారందరిలో కామన్ గా జ్వరం, పొట్టలో విపరీతమైన నొప్పి వచ్చినట్లు గుర్తించామని వారు. వారిలో ముగ్గురికి స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios